ఆలిండియా సూపర్ స్టార్, బాలీవుడ్ మెగాస్టార్, షెహన్ షా ఆఫ్ ఇండియన్ సినిమా.. ఇవన్నీ ఒకేఒక్క హీరోకు దక్కిన ఘనతలు. ఆయనే అమితాబ్ బచ్చన్. ఇప్పటికీ అఫిషియల్ నెంబర్ వన్ హీరో ఆఫ్ ఇండియా. మరి ఇలాంటి హీరోతో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలని కోరుకోని వారు ఉండరేమో. ఆ అవకాశాన్నీ, అదృష్టాన్ని ఒడిసిపట్టుకున్నాడు మన తెలుగు డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్. ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాతో పూరి అద్భుత అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ సినిమా విడుదలై నేటితో 9ఏళ్లు పూర్తి చేసుకుంది.

IHG

 

అమితాబ్ తన 69వ ఏట చేసిన ఈ సినిమా 2011 జూలై 1న విడుదలైంది. తనకు బాగా కలిసొచ్చిన విజయ్ పేరుతోనే ‘విజు’గా మాజీ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించారు బచ్చన్. ఆయన తనయుడిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో సోనూ సూద్.. గ్యాంగ్ స్టర్ గా ప్రకాశ్ రాజ్ నటించారు. గ్యాంగ్ లు వదిలేసి పారిస్ వెళ్లిపోయి మళ్లీ ముంబై వస్తాడు విజు భాయ్. సిటీలో వరుస బాంబు పేలుళ్లకు ప్లాన్ చేస్తున్న గ్యాంగ్ పని పడతాడు. పోలీస్ ఆఫీసర్ అయిన తన కొడుకుకు హెల్స్ చేస్తూ తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి కథ నడిపిస్తాడు.

IHG

 

వయసుకు తగ్గ పాత్రలో అమితాబ్ నటనతో ఆకట్టుకున్నాడు. తన స్టైల్ ఆఫ్ యాక్షన్, కామెడీ, రొమాన్స్.. ఏ విషయంలో కూడా బచ్చన్ తక్కువ చేయలేదు. మాజీ ప్రేయసిగా రవీనాటాండన్ నటించింది. ఓ పాత్రలో చార్మీ నటించింది. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా మంచి లాభాలను తీసుకొచ్చింది. అటుఇటుగా ‘పోకిరి’ రివర్స్ వెర్షన్ అనిపించినా పూరి తన మ్యాజిక్ తో మెప్పించాడు. అమితాబ్ తో సినిమా అవకాశాన్ని ఇప్పించిన గురువు ఆర్జీవీ నమ్మకాన్ని పూరి ఘనంగా నిలబెట్టుకున్నాడు.  

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: