కొన్ని రోజులుగా ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ కు పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇటివల ‘కప్పెల’ అనే మళయాళ సినిమా చూసాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ‘హీరో పిచ్చోడిలా రీసౌండ్ చేస్తూ అరవడు, అందరికంటూ స్మార్ట్ గా డైలాగుల్లో సామెతలు చెప్పరు, గాల్లో ఎగిరే ఫైట్లు చేయరు, రెండు నిముషాలకోసారి ప్రత్యక్షమవరు.. ఆఖరి పది నిముషాల్లో దేశభక్తి, రైతులకు సేవ.. వంటి మెసేజెస్ ఇవ్వరు.. అయినా అక్కడ ఈ సినిమా చూశారు’ అని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చాడు.

IHG

 

అయితే.. తరుణ్ భాస్కర్ తమ హీరోనే అన్నాడని సదరు హీరో అభిమానుల్లో కొందరు ట్రోలింగ్ చేశారు. తరుణ్ అభిప్రాయంలో ఆ హీరో నటించిన రెండు హిట్ సినిమాలను పోలి ఉన్నాయంటూ ట్రోల్ చేశారు. దీంతో విసుగెత్తిపోయిన తరుణ్ భాస్కర్ ఈరోజు తనను దూషించిన ఇద్దరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను వ్యక్తిగతంగా దూషించారని ఇద్దరి పేర్లు, వారి ఫోన్ నెంబర్లను కూడా అందజేశాడు. ‘వారి నెంబర్ల ఆధారంగా మాట్లాడినా వారు బెదిరింపు స్వరంతోనే మాట్లాడారు. ఆ ఫోన్ కాల్స్ కూడా పోలీసులకు ఇచ్చాం’ అని చెప్పుకొచ్చాడు తరుణ్ భాస్కర్. ఈమేరకు తన ట్విట్టర్ అకౌంట్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ను పోస్ట్ చేశాడు.

 

మళయాళ సినిమాపై నా అభిప్రాయాన్ని నేను చెప్పుకున్నానని అంటున్నాడు తరుణ్. కానీ.. కొందరి అత్యుత్సాహం వల్ల.. సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇటువంటి చర్యలకు దిగుతున్నారు. ఫలితంగా వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఇటివల నటి మీరాచోప్రాకు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఇదే అనుభవం ఎదురైన నేపథ్యంలో ఆమె కూడా సైబర్ కంప్లైంట్ ఇచ్చింది. మరి.. తరుణ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: