ఇప్పుడు స్టార్ నటులు అందరూ కూడా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు ఇప్పట్లో చేసే అవకాశం లేకపోవడంతో అందరూ కూడా వెబ్ సీరీస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. వెబ్ సీరీస్ ల మీద ఆదాయం కూడా భారీగా ఉన్న నేపధ్యంలో వాటి మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మొన్నటి వరకు సినిమాల్లో అవకాశాలు లేని వారు,  సీనియర్ హీరోయిన్ లు, యువ హీరోయిన్ లు మాత్రమే చేస్తూ వచ్చారు. యువ హీరోయిన్ లు కొంత మంది వాటి నుంచే పాపులర్ అయ్యారు అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరి కొందరు హీరోయిన్ లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. 

 

ఇక కీలక నటులు కొందరు వెబ్ సీరీస్ ల మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు... ప్రకాష్ రాజ్ వెబ్ సీరీస్ మీద దృష్టి పెట్టి ఒక వెబ్ సీరీస్ ని దాదాపుగా ఆయన పూర్తి చేసారు. దీనిని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా టైటిల్ ని అనుకోలేదు అని త్వరలోనే టైటిల్ ని అనుకుని అప్పుడు లాంచ్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని పనులు నడుస్తున్నాయి అని అవి పూర్తి అయిన తర్వాత మొదలు పెడతారు అని సమాచారం. 

 

దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ దాదాపు ఒకే ఇంట్లో నెల రోజుల పాటు షూట్ కూడా చేసారట. ఇక కన్నడ మాజీ హీరోయిన్ ఒకరు కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. కాగా దీనికి సంబంధించి ప్రకాష్ పారితోషికం తీసుకోవడం లేదట. లాభాల్లో మాత్రమే వాటా తీసుకుంటారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: