అగ్ర హీరోల సినిమాల్లో ఒకప్పుడు అనుష్క  అనే పేరు ఒక క్రేజ్. ఆమె సినిమాల్లో ఉంది అంటే ఆ సినిమా ఏ విధంగా ఉన్నా సరే కచ్చితంగా హిట్ అవుతుంది అని అంటూ ఉంటారు. సినిమాలో ఆమె నటన లేదా ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే మాత్రం జనాలు సినిమాను అసలు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనే సంగతి అందరికి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె ఉంటే సినిమాకు ఒక రేంజ్ అనేది వస్తుంది. ప్రభాస్ అయినా మహేష్ బాబు అయినా మరొకరు అయినా సరే ఆమె నటిస్తే మాత్రం సినిమాలో ఒక పిచ్చి అనేది ఉంటుంది జనాలకు. 

 

ఇక ఇప్పుడు ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉంది. దానికి కారణం ఏంటీ అనేది ఎవరికి తెలియదు గాని ఆమె మాత్రం సినిమాలకు కాస్త దూరంగా ఉంది. అవకాశాలు రాక ఆమె సినిమాల్లో చేయడం లేదు అని అంటున్నారు. ఇక ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఆమె ఒక వేశ్య పాత్రలో నటిస్తుంది అని అంటున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా లో ఒక అన్యాయానికి గురైన వేశ్య పాత్రలో ఆమె నటిస్తుంది అని ఆమెను పవన్ కళ్యాణ్ కాపాడతాడు అని తన తో  పాటు ఆమెను దొంగతనాలకు తీసుకుని వెళ్ళగా ఒక గొడవలో ఆమె చనిపోతుంది అని సమాచారం. 

 

దీనికి సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.  ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి మరి. కాగా పవన్ ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: