ఇప్పుడు సినిమాల నిర్మాణం విషయంలో నిర్మాతలు చాలా వరకు భయపడుతున్నారు. సినిమాలో గతంలో స్వేచ్చగా పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఇప్పుడు ఆ వాతావరణం లేకపోవడం తో కాస్త వెనక్కు తగ్గారు. అగ్ర హీరోల సినిమాల విషయంలో కూడా గతంలో మాదిరిగా పరిస్థితి లేదు అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు అనగానే స్వేచ్చగా అడుగులు వేసిన నిర్మాతలు దర్శకులు ఇప్పుడు మాత్రం అమ్మో అనే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు కొందరు నిర్మాతలు అయితే స్టార్ హీరోలు కాదు అసలు సినిమాలే వద్దు అనే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు దిల్ రాజు అసలు సినిమాలను వద్దు అని భావిస్తున్నారు అని టాక్ మరి టాలీవుడ్ లో. ఆయన ఒక మాజీ హీరోయిన్ తో వెబ్ సీరీస్ చేసే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. దీనికి సంబంధించి అనేక చర్చలు జరుగుతున్నాయి అని సమాచారం. మాజీ లేదా ఇప్పుడు అవకాశాలు లేని ఒక సీనియర్ హీరోయిన్ తో చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు అని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పుడు చర్చలు పూర్తి అయితే ముందుకు అడుగు పడే అవకాశాలు ఉంటాయి అని అంటున్నారు మరి. 

 

దీనికి సంబంధించి భారీ  బడ్జెట్ అవసరం లేదు అని కొంత ఉంటే చాలు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆయన ఈ అడుగు వేసారు అని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత ఆయన ఇవ్వడం ఖాయమని టాలీవుడ్ లో అంటున్నారు. ఇప్పుడు ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆయన సినిమా చేసే అవకాశం ఉంది. ఇక వెబ్ సీరీస్ చేస్తారా సినిమానా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: