మన తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నటుల్లో... బ్రహ్మానందం ఒకరు. ఆయన సినిమాలు అనగానే అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు అప్పట్లో జనాలకు ఒక పిచ్చి. స్టార్ హీరోలతో సమానం గా ఆయనకు మంచి ఇమేజ్ ఉండేది. ఏ విధంగా అయినా సరే ఆయన మంచి పాత్రలు చేస్తారు అని ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఆయన సినిమాలు చేస్తారు అని అందరూ అంటారు. ఇక ఇప్పుడు ఆయన సినిమాలు చేయడం లేదు. ఆయనకు అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. 

 

సినిమాల్లో కమెడియన్ లు లేకపోవడం సినిమాల్లో కామెడి చేస్తే హీరోలతోనో లేక హీరోయిన్ లతోనో చేయించడం వంటివి చేస్తున్నారు గాని స్టార్ హీరోల సినిమాల్లో ఆయనకు అవకాశాలు అనేవి రావడం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన సీరియల్స్ చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. ఆయనకు ఇంకా నటించాలి అని ఉంది అని అందుకే ఆయన సీరియల్స్  లో నటించే ఆలోచనలో ఉన్నారు అని టాలీవుడ్ లో టాక్ మరి. దీనికి సంబంధించి ఆయన ఇటీవల ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు అని అంటున్నారు. 

 

మా టీవీ లో వచ్చే ఒక సీరియల్ లో ఆయన నటించే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. మరి నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని చర్చలు ఇంకా నడుస్తున్నాయి అని ఆయన పాత్ర విషయంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. త్వరలోనే ఈ సీరియల్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఆయన చేసే పాత్ర సీరియల్ లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: