కరోనా టైమ్ అనే కాదు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నష్టపోయిన దర్శకుడు ఎవరైనా ఉన్నాడంటే.. అది కొరటాలే. వెనకాల మిర్చి.. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్.. భరత్ అనే నేను లాంటి వరుసగా నాలుగు హిట్స్ ఉన్నా.. కొరటాల మాత్రం ఓ విషయంలో నష్టపోయాడు. ఈ లాస్ ను పూడ్చుకునేందుకు కరోనాను ఉపయోగించుకుంటూ.. కొత్త ఐడియాతో దూసుకుపోతున్నాడు. ఖాళీగా లేకుండా పనికి పనీ.. డబ్బుకు డబ్బు సంపాదిస్తున్నాడు. 

 

కొరటాల శివ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. 2018 సమ్మర్ లో వచ్చిన భరత్ అనేనేను తర్వాత ఇంత వరకు కనిపించలేదు. చిరంజీవితో ఆచార్య సినిమా కమిట్ అయినా.. సైరా పూర్తయి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. సైరా విడుదల తర్వాత ఆచార్య సెట్స్ పైకి వచ్చినా.. ఇంతలో కరోనా వచ్చి అడ్డుకుంది. 

 

ఆచార్య షూటింగ్ 40శాతం మాత్రమే పూర్తయింది. కరోనా విజృంభించడంతో.. ఇప్పట్లో షూటింగ్ మొదలుకాదు. కరోనా తగ్గిన తర్వాతే కెమెరా ముందుకు రావాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నాడు. సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో.. కొరటాల కెరీర్ ఆచార్యతో మూడేళ్లు గడిచిపోతోంది. 

 

ఇంతకాలం ఆచార్యతో గడిపేసిన కొరటాల ఈ మెగా ప్రాజెక్ట్ నుంచి బయటపడ్డాడు. కరోనా టైమ్ కలిసొచ్చి మిగతా సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే చిత్రాలకు కథా సహకారం అందిస్తున్నాడు. దర్శకులు ఎవరైనా.. కథ విషయంలో సలహాలు.. సూచనలు ఇస్తున్నాడట. నచ్చకపోతే.. కొన్ని మార్పులు చేయిస్తన్నాడు. ఇలా ఆ ప్రొడక్షన్ హౌస్ నిర్మించే ప్రతీ సినిమాలో కొరటాల పాత్ర ఉంటుంది. టైటిల్స్ కార్డ్ లో సహకారం.. సలహాలు సూచనలు అని వేస్తారేమో. వర్క్ చేసినందుకు రాయల్టీ కింద బాగానే ఇస్తున్నారట. ఇలా.. రెండేళ్ల నుంచి ఆచార్యతో గడిపేసిన కొరటాల.. ఇతర దర్శకుల కథలను డైరెక్ట్ చేస్తూ.. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: