టాలీవుడ్ లో తమన్నా విషయంలో కొన్ని కొన్ని వార్తలు ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా హడావుడి చేస్తున్నాయి. పాపకు స్టార్ ఇమేజ్ ఉన్న నేపధ్యంలో ఆమెను వదులుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉండటం లేదు అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఆమెకు ఇప్ప్పటికి కూడా ఒక మంచి ఇమేజ్ ఉంది అని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె పాత్రలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద జనాలకు ఒక ఆసక్తి ఇప్పటికి కూడా ఉంది అనే చెప్పాలి. ఆమె సినిమాల్లో చాలా వరకు ఈ మధ్య కాలంలో ఫ్లాప్ అవుతున్నాయి. 

 

ఇక అందుకే స్టార్ హీరోలు ఆమె విషయంలో కాస్త ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు. అది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ కూడా కమర్షియల్ కోణం లోనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి హీరోయిన్ ల విషయంలో కమర్షియల్ గానే ఆలోచన్ చేస్తున్నారు. అందుకే తమన్నా కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ అనేది కాస్త తగ్గడం ఆమెకు కమర్షియల్ గా అంత ఇమేజ్ లేకపోవడం తో ఆమెను ఎవరూ కూడా వద్దు అని చెప్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఐటెం సాంగ్స్ విషయంలో కూడా ఆమెను దాదాపుగా పక్కన పెడుతున్నారు స్టార్ హీరోలు అని అంటున్నారు. 

 

ఇటీవల ఒక సినిమాలో ఒక స్టార్ హీరో ఆమెను తీసుకుందామా అని అడగగానే వద్దు అని చెప్పాడు అని టాక్... దీనితో ఇప్పుడు ఆమె కాస్త ఇబ్బంది పడుతుంది అని వరుసగా సినిమాలు చేయడం లో ఆమె ఆలోచనలో పడింది అని అంటున్నారు. మంచి పాత్రలు వచ్చినా సరే అవి అంతగా తనకు ఇమేజ్ తీసుకుని రావడం లేదనే బాధలో ఆమె ఉన్నారట మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: