టాలీవుడ్ లో బాగా ఇబ్బంది పడిన నటుల్లో జగపతి బాబు ఒకరు అనే సంగతి తెలిసిందే. ఆయనకు కెరీర్ మొదట్లో వచ్చిన స్టార్ ఇమేజ్ ఆ తర్వాత దానిని ఆయన నిలబెట్టుకోలేక పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన రెండు మూడు సినిమాలో చేస్తున్నారు. ఈ రెండు మూడు సినిమాలు కూడా ఆయనకు  మంచి ఇమేజ్ తీసుకుని వచ్చే సినిమాలే. ఆయనకు స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఎప్పుడు అయితే లెజెండ్ సినిమా నుంచి వచ్చిందో ఇక అక్కడి నుంచి ఆయన కెరీర్ బాగా ఊపు అందుకుంది అనే సంగతి తెలిసిందే. 

 

స్టార్ హీరోల సినిమాల్లో ఆయనకు మంచి ఆఫర్లు రావడం తండ్రి సహా విలన్ వంటి పాత్రలు బిజినెస్ మెన్ పాత్రలు రావడంతో ఆయన కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన నిర్మాతగా మారుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన నిర్మాతగా సినిమాలు చేయడానికి గానూ ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు అనే ప్రచారం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో బాగానే జరుగుతుంది.  ఆయనకు స్టార్ హీరోలతో నిర్మాతగా వ్యవహరించే అవకాశం వచ్చింది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. 

 

ఆయన ఇటీవల చెన్నై లో ఒక కార్యక్రమానికి వెళ్ళగా అక్కడికి ఒక స్టార్ హీరో వచ్చి సినిమా చేద్దామని కథ కూడా కొత్తగా ఉంటుంది అని చెప్పగా ఆయన కూడా అందుకు ఓకే చెప్పారు అని కథ కూడా విన్నారు అని అంటున్నారు. ఆ స్టార్ హీరో హీరో ఎవరో కాదు నానీ అని  టాక్ టాలీవుడ్ లో. వారు ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి రెడీ అయ్యారు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: