టాలీవుడ్ లో కమర్షియల్ అనే కోణం ఎప్పుడు అయితే బయటకు వచ్చిందో ఇక అక్కడి నుంచి స్టార్ హీరోలు అందరూ కూడా జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకుంటూ వరుసగా సినిమాలను చేస్తూ వస్తున్నారు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే సినిమాల విషయంలో చాలా వరకు అదే ఆలోచనలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దాదాపుగా ఇప్పుడు సినిమాలు అన్నీ కూడా అదే విధంగా వస్తున్నాయి. అయితే ఇక నుంచి కమర్షియల్ సినిమాలు వద్దు అనే ఆలోచనకు నిర్మాతలు హీరోలు దర్శకులు వచ్చారు అనే వార్తలు వస్తున్నాయి. 

 

కమర్షియల్ సినిమాల విషయంలో ఇప్పుడు హీరోలు చాలా వరకు ఆలోచనలో పడ్డారు అనే ప్రచారం బాగానే జరుగుతుంది. దానికి కారణం నష్టాలు వచ్చే అవకాశం ఉండటమే. కమర్షియల్ సినిమాలు చేస్తే నష్టమే గాని లాభం ఉండే అవకాశం దాదాపుగా ఉండదు అనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు చాలా వరకు కథలో మంచి పాత్ర ఉండి నటనకు ప్రాధాన్యత ఉంటే మాత్రమే సినిమా చెయ్యాలి అని భావిస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ మరి. ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి గాని దాదాపుగా ఇది ఫలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

 

ఎందుకు అంటే జనాలు ఇంట్లో కూర్చునే ఇప్పుడు సినిమాను చూసే ఆలోచనలో ఉన్నారు అనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఇది ఫలించే అవకాశాలు ఉంటాయి అని అంటున్నారు. ఇప్పుడు దాదాపుగా స్టార్ హీరోలు అందరూ కూడా కమర్షియల్ అనే కోణం వదిలేస్తే మంచిది అనే నిర్ణయం తీసుకునే సినిమాలను ముందుకు తీసుకుని వెళ్తున్నారు అని చెప్పాలి. ఇప్పుడు రెండు మూడు సినిమాలను లైన్ లో ఉంచిన మహేష్ బాబు కూడా వద్దనే అంటున్నాడు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: