ఒకప్పుడు బాలీవుడ్లో తన హవాను నడిపించి ఆ తరువాత ఏకంగా హాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసి గ్లోబల్ స్టార్ గా  మారిపోయింది ప్రియాంక చోప్రా. అయితే తాజాగా ప్రియాంక చోప్రా ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజ  సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ తో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది, మల్టీ మిలియన్ డాలర్ల విలువ చేసే ఫస్ట్ లుక్ అనే టెలివిజన్ పై తాజాగా ప్రియాంక చోప్రా సైన్ చేశారు, ఇక దీని కోసం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెజాన్  కలిసి రెండేళ్ళు పని చేయనున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక చోప్రా హిందీ ఇంగ్లీష్ లోనే కాకుండా తనకు ఇష్టమైన భాషల్లో కూడా నటిస్తాను  అంటూ చెప్పుకొచ్చారు.


 మహిళలకు సంబంధించిన విషయాలను తెరమీద చూపించాలనే తన కోరిక అంటూ ప్రియాంక తెలిపారు, ఇలాంటి కథలను ఎంతో విభిన్నంగా చూపించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప క్రియేటర్స్ తో కలిసి పని చేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నారు అంతా ప్రియాంక తెలిపింది. ఇలా పని చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ప్రజాదరణ ఉన్న అమెజాన్ లాంటి ఒక భాగస్వామి తనకు దొరకడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది ప్రియాంక,



ప్రపంచంలోని సరికొత్త ప్రతిభను వెలికి తీసే గొప్ప కంటెంట్ సృష్టించాలి  అన్నది ఒక నటిగా నిర్మాతగా తన ఆలోచన అని... ఒక పవర్ఫుల్ కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మించడం తన  నిర్మాణ సంస్థ ముఖ్య ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు. అయితే కొత్త దానికి పునాది వేయడానికి ప్రస్తుతం అమెజాన్ సంస్థ తో  పనిచేస్తున్నట్లు ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు, ప్రస్తుతం తన 20 ఏళ్ల కెరీర్లో 60 సినిమాలు చేసిన తర్వాత... సరికొత్త బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చారు గ్లోబల్ స్టార్  ప్రియాంక చోప్రా.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: