శోభన్ బాబు అనాటి లేడీస్ కి స్వీట్ హీరో. ఆయన వెండి తెర మీద కనిపిస్తే చాలు వారిలో చెప్పలేని ఆనందం. ఇద్దరు హీరోయిన్లతో శోభన్ నానా పాట్లు పడుతూంటే ఫ్యామిలీస్ తెగ ఎంజాయ్ చేసేవి. నిజానికి ఇద్దరు భార్యలు అంటేనే లేడీస్ కి కోపం రావాలి. కానీ అక్కడ శోభన్ బాబు చేస్తే మాత్రం చాలా ఇష్టంగా చూసేవారు.

IHG

శోభన్ ట్రేడ్ మార్క్ లా ఇద్దరేసి హీరోయిన్లు ఉండేవారు. ఇక శోభన్ బాబు అనేక రకాల కధాంశాలు చేసుకుని హిట్ కొట్టారు. అయితే శోభన్ బాబు మంచి పీక్ స్టేజ్ లో ఉన్నపుడు ఆయనకు బ్లాక్ బస్టర్ మూవీస్ లో చేసే ఆఫర్ వచ్చింది. అయితే శోభన్ బాబు వాటిని కాదనడంతో అవి ఎన్టీయార్ వద్దకు వెళ్ళి చరిత్రలో నిలిచే హిట్లు అయ్యాయి.

IHG

వాటిలో మొదటిది అడవిరాముడు. దీన్ని సత్యచిత్ర బానర్లో తీశారు. నిజానికి ఈ బ్యానర్ కి శోభన్ బాబుకి ఎంతో బ్యాండేజ్ ఉంది. ఈ బ్యానర్ మీద తీసిన తాశీల్దార్ గారి అమ్మాయి బ్లాక్ బస్టర్ హిట్. అందులో శోభన్ బాబు డ్యుయల్ రోల్ పండించారు. ఆ తరువాత వచ్చిన ప్రేమ బంధం కూడా హిట్ మూవీ. ఈ మూవీస్ తరువాత ఇదే బ్యానర్ శోభన్ బాబుతో అడవిరాముడు ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన కధను నిర్మాత సూర్యనారాయణ రెడీ చేసి శోభన్ బాబు కి ముళ్ళపూడి వెంకటరమణ ద్వారా వినిపించారట.

IHG

అయితే కధ నచ్చినా కూడా అడవి నేపధ్యం కావడంతో అంతా ఫారెస్ట్ లో షూటింగ్ కావడంతో అవుట్ డోర్ కి శోభన్ బాబు దూరం కావడంతో నో అనేశారు. ఆ తరువాత అదే కధలో మార్పు చేసి ఎన్టీయార్ కి వినిపిస్తే ఆయన ఓకే చేశారు. దానికి కె రాఘవేంద్రరావు మార్క్ డైరెక్షన్ తోడై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే ఇదే సినిమా శోభన్ బాబు చేసి ఉండే ఇండస్ట్రీ  హిట్ ఆయన సొంతం అయ్యేది. అప్పట్లోనే అడవి రాముడు నాలుగు కోట్లు వసూల్ చేసింది.

IHG

 అదే విధంగా పల్లవీ పిక్చర్స్ బ్యానర్ కూడా శోభన్ బాబుతో అనేక సినిమాలు తీసింది. వారు యమగోల కధను తీసుకుని మొదట  శోభన్ బాబు వద్దకు వెళ్తే నో చెప్పారట‌. అది ఆటోమెటిక్ గా ఎన్టీయార్ వద్దకు వెళ్లడం, ఆయన ఎస్ చెప్పడం జరిగాయి. అది కూడా సూపర్ డూపర్ హిట్టే. అలా 1977లో ఒకే ఏడాది ఎన్టీయార్ కి బ్లాక్ బస్టర్ హిట్లు వస్తే అదే ఏడాది శోభన్ బాబు మిగిలిన  సినిమాలు పెద్దగా ఆడలేదు. అందుకే అంటారు ఏ సినిమా మీద ఏ హీరో పేరు రాసిఉందో అని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: