బాబాబ్ అబ్బాయ్ కాంబో అంటేనే అదో రకం మ్యాజిక్ ఉంటుంది. రెండు తరాల మధ్య వారధిగా కధ ఉంటుంది కాబట్టి ఎమోషనల్స్ అన్నీ టచ్ అవుతాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్లో చాలా మంది బాబాయ్ అబ్బాయిలు ఉన్నారు. వారితో మంచి కధలు కుదిరితె  హిట్ మూవీస్ అవుతాయి. ఇక బాబాయ్ అబ్బాయిగా  అలాంటి ఇలాంటి జోడీ కాని మెగా జోడీ పవన్, రాం చరణ్.

IHG's comeback film ...

ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తే చూడాలని అభిమానుల చిరకా కోరిక. అయితే ముందే చెప్పుకున్నట్లుగా కధ ఉండాలి. ఇద్దరికీ సరితూగే సీన్స్ ఉండాలి. లేకపోతే అది పండదు, అయితే అలాంటి కధ కోసం కూర్చోకుండా ముందుగా కొన్ని సీన్లనోనైనా ఈ జంట కనిపిస్తే కన్నుల పంటే అంటున్నారు. అపుడు ఆ సినిమాకు హైప్ పెరగడమే కాదు, ఫ్యాన్స్ కి పిచ్చగా నచ్చేస్తుంది. కమర్షియల్ గా కూడా కాక రేపుతుంది. ఇపుడు అలాంటి న్యూసే ఒకటి టాలీవుడ్లో స్ప్రెడ్ అవుతోంది. అదేంటి అంటే పవన్ చరణ్ కలసి ఒక సినిమాలో కనిపిస్తారట. అదే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హిస్టారికల్ మూవీ విరూపాక్షలో చరణ్ గెస్ట్ రోల్ చేస్తాడని అంటున్నారు.

IHG

ఈ మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సంగతి విధితమే. ఇక బడా నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీ కరోనా తగ్గాక సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ మూవీలో ఏ స్పెషల్ రోల్ ఉందిట. దాన్ని చరణ్ తో చేయిస్తే బాగుంటుందని డైరెక్టర్ క్రిష్ అనుకుంటున్నాడుట. ఆ విధంగా పవన్ చరణ్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే హైలెట్ అవుతుంది అంటున్నారు. మరి చూడాలి అది నిజమవుతుందా  లేదా అన్నది. ఏది ఏమైనా మెగాభిమానులకు ఇది మామూలు న్యూస్ అయినా ఆనందంలో తేల్చేసిదిగా ఉందిట. మరి నిజం కావాలని అంతా కోరుకుంటున్నారుట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: