వైవియస్ చౌదరి దర్శకత్వంలో 'దేవదాసు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో 'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయి వరుస అవకాశాలు దక్కించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో నటించడం జరిగింది. ఒకపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే మరో పక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తూ అక్కడ కూడా విజయాలు సాధించడం జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత వరుస ఫ్లాపులు రావటంతో ఈ గోవా బ్యూటీ కి అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో ఇలియానా కెరీర్ క్లోజ్ అయిపోయిందని అదేసమయంలో ఆమె ప్రియుడు తో కూడా బ్రేకప్ కావటంతో పాటుగా తన ఫిట్ నెస్ మొత్తం కోల్పోవడంతో ఇలియానా కెరియర్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే అని అందరూ భావించారు.

 

ఆ తర్వాత మళ్లీ ఫిట్ నెస్ సాధించి సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలు పెడుతూ అవకాశాల కోసం ప్రజెంట్ అనేక పాట్లు పడుతోంది. ఇలియానాకి క్రేజ్ తగిన గాని సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ అలానే ఉంది. ఎప్పటికప్పుడు వర్క్ అవుట్ వీడియోలు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయర్స్ కి  హీటెక్కిస్తుంది. లాక్డౌన్ టైం లో ఇంటికే పరిమితమైన ఇలియానా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన చిలిపి ప్రశ్నలకు సమాధానాలు ఓపిగ్గా చెప్పింది.

 

మీ బాడీ మీద ఎన్ని టాటూస్ ఉన్నాయని ఓ అభిమాని అడగగా… ఐదు ఉన్నట్లు చేతి వేలు చూపిస్తూ ఆన్సర్ ఇచ్చింది. సినిమాలు అవకాశాలు లేని టైములో ఏం చేస్తారు అని మరొక అభిమాని అడిగిన ప్రశ్నకు సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తానని తెలిపింది. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడగగా… భోజన ప్రియులను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని కొంటెగా సమాధానమిచ్చింది. అలాగే జిమ్ లో 40 నిమిషాల పాటు వర్క్ ఔట్స్ చేస్తానని ఇలియానా తెలిపింది. త్వరలో సౌత్ లో ఓ సినిమా చేయడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: