డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మొదటిసారి వారి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ రికార్డులు కొట్టగా మహేష్ కు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చింది. ఇక సెకండ్ మూవీగా వచ్చిన్ బిజినెస్ మెన్ సినిమా కూడా మహేష్ కెరియర్ లో మంచి హిట్ సినిమాగా నిలిచింది. మహేష్ తో రెండు సినిమాలు చేసిన పూరి సూపర్ స్టార్ కోసం జనగణమన సబ్జెక్ట్ రాసుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేయాలని అనుకున్న పూరి మహేష్ కు కథ వినిపించాలని చూస్తున్నాడు.

 

అయితే మహేష్ మాత్రం పూరితో సినిమా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. టెంపర్ నుండి వరుస ఫ్లాపులు తీసిన పూరి ఫైనల్ గా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత జనగణమన ఉంటుందని తెలుస్తుంది. అయితే జనగణమన తీస్తే అది మహేష్ తోనే అంటూ చెప్పుకొచ్చిన పూరి డెశిషన్ మార్చుకున్నట్టు తెలుస్తుంది.

 

ఓ పక్క మహేష్ మాత్రం ఈమధ్య ఫ్యాన్స్ చాట్ లో పూరితో సినిమాకు నేను వెయిటింగ్ అన్నాడు. కాని నమ్రత లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో చేసిన చాట్ చూస్తే పూరితో సినిమాపై మీ కామెంట్ ఏంటంటే అది కాలమే నిర్ణయిస్తుందని చెప్పింది. అంటే పూరితో సినిమా విషయంలో మహేష్ అంత ఇంట్రెస్టెడ్ గా లేదన్న విషయం మాత్రం అర్ధమవుతుంది. అయితే నమ్రత నాకు తెలియదు అనే సమాధానాన్నే అలా చెప్పి ఉండొచ్చు. విజయ్ సినిమా హిట్టు కొట్టి మంచి కథతో మహేష్ ను మెప్పిస్తే తప్పకుండా పూరి, మహేష్ హ్యాట్రిక్ కాంబో మళ్లీ కుదిరే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: