వాళ్లిద్దరూ స్టార్ హీరోయిన్సే కానీ.. ఇంతవరకు తామేమిటో నిరూపించుకోలేదు. అందంతో ఒకరు.. లక్ తో మరొకరు స్టార్స్ అయ్యారేగానీ.. నటిగా పేరు తెచ్చుకోలేదు. విచిత్రమేమిటంటే.. తెలుగులో ప్రస్తుతం వీరిద్దరిదే హవా. పెర్ఫామెన్స్ లేకుండానే టాలీవుడ్ ను ఏలుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జోరంతా పూజా హెగ్డే.. రష్మిక మందన్నాదే. కీర్తి సురేష్ మహానటితో.. సమంత ఓ బేబీతో.. తమన్నా సైరాతో సత్తా చాటారు. అందంతో పాటు.. అభినయం కూడా ఉందని నిరూపించుకున్నారు. అయితే.. పూజా, రష్మిక వరుస హిట్స్ కొడుతున్నా.. వాళ్ల ఖాతాలో చెప్పుకునే సినిమా ఒక్కటీ లేకపోవడం విశేషం. 

 

పూజా హెగ్డే తెలుగు ప్రయాణం ఒక లైలా కోసం అనే ఫ్లాప్ మూవీతో మొదలైంది. రెండో సినిమా ముకుందా సక్సెస్ ఇవ్వలేదు. దువ్వాడ జగన్నాథమ్ తో భారీగా అందాలు ఆరబోసి స్టార్ హీరోల దృష్టిలో పడింది. ఇక అరవింద సమేత వీర రాఘవతో సక్సెస్ ప్రయాణం స్టార్ట్ చేసి వరుసగా నాలుగు హిట్స్ అందుకుంది. మహర్షి.. గద్దల కొండ గణేశ్.. అల వైకుంఠపురములో లాంటి హిట్స్ పూజాను టాప్ లెవల్ లో కూర్చోబెట్టాయి. 

 

ఒక లైలా కోసం నుంచి అల వైకుంఠపురములో వరకు పూజా హెగ్డే యాక్టింగ్ ప్లస్ అయిందని చెప్పడానికి ఒక్క సినిమా కూడా లేదు.  అల వైకుంఠపురములో 150కోట్లు తీసుకొచ్చినా.. గ్లామర్ కే మార్కులు పడ్డాయి. మేడమ్ సార్ మేడమ్ అంతే అని బన్నీకి అనిపించినా.. అది గ్లామర్ గురించే తప్ప యాక్టింగ్ గురించి కాదు. స్టార్స్ అందరూ.. నటిగా నిరూపించుకున్నవాళ్లే. మరి పూజా ప్రభాస్ తో నటిస్తున్న రాధే శ్యామ్ తో.. అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ తో.. నటిగా పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి. 

 

పూజా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తుంటే.. రష్మిక మందన్నా.. లక్ తో నడిపించేస్తోంది. గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేసే పర్సనాలిటీ రష్మికాది కాకపోయినా.. అదృష్టం కలిసొచ్చి సినిమాలు హిట్ అవుతున్నాయే తప్ప.. ఈ అమ్మడు యాక్టింగ్ హైలెట్ గా నిలిచిన సినిమా ఒక్కటీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: