స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రంగస్థలంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన బన్ని పోస్టర్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అయితే సినిమాను ముందు తెలుగులోనే చేయాలని అనుకోగా కథలో కొన్ని మార్పులు చేసి నేషనల్ వైడ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 

 

సినిమాలో హీరోయిన్ గా కన్నడ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నని సెలెక్ట్ చేశారు. అయితే ముందు ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకున్నారట. ఆల్రెడీ సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో మెప్పించింది సమంత. ఇక పుష్ప సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర దాదాపు రామలక్ష్మి పాత్రకు దగ్గరగా ఉంటుందని సమంత ఈ సినిమాకు నో చెప్పిందని టాక్. అయితే పాత్ర ఒకేలా ఉన్నా సుక్కు టేకింగ్ వేరేలా ఉంటుంది కాబట్టి పుష్ప ఛాన్స్ సమంత ఓకే చేసి ఉంటే బాగుండేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

 

లాస్ట్ ఇయర్ మజిలీ, ఓ బేబీ ఈ ఇయర్ జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ప్రస్తుతం కథల విషయంలో ఆచి తూచి సెలెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో సినిమా మాత్రమే ఓకే చేసిన సమంత తెలుగులో విక్రం కుమార్, నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా చేస్తుందని టాక్. తెలుగులో వేరే సినిమాలేవి కమిట్ అవని సమంత అమేజాన్ ప్రైం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ సీజన్ 2లో నెగటివ్ రోల్ లో నటించిందని తెలిసిందే.                   

మరింత సమాచారం తెలుసుకోండి: