తెలుగు సినిమాల్లో హీరోయిన్ల కెరీర్ తక్కువనే మాటను అబద్దం చేసిన హీరోయిన్లలో టాప్ లో ఉంటుంది త్రిష. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 17ఏళ్లు అవుతున్నా ఇంకా తరగని అందం ఈ చెన్నై చంద్రం సొంతం. త్రిషకు ఉన్న ప్లస్ ఆమె అందం.. నవ్వు. 1999లోనే మిస్ చెన్నైగా గెలిచిందంటే ఆమె స్మైలే కారణం. అందం, నవ్వుతోపాటు త్రిషలో ఉన్న మరో అద్భుతం ఆమె నటన. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా తనదైన హావభావాలతో మెప్పించడం త్రిష సొంతం. అటువంటి క్యారెక్టర్లెన్నో తన కెరీర్లో చేసింది త్రిష.

IHG

 

వర్షంలో చిలిపిగా నటించింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో అణుకువగా ఉండే అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. అతడులో.. బావను ఆటపట్టించే అల్లరి పిల్లగా సందడి చేసింది. స్టాలిన్ లో గ్లామర్ డాల్ గా నటించింది. ఆడవారిమాటలకు అర్ధాలే వేరులేలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ – ప్రేమికురాలిగా ఆకట్టుకుంది. ఇన్ని పాత్రల్లోనూ తన అందం, నటనకు తన మార్క్ చిరునవ్వును మిక్స్ చేసి ప్రేక్షకుల్ని మాయ చేసింది. నటనకు స్కోప్ ఉన్న సినిమాల్లో పాత్రకు తగ్గ హావభావాలను తన ముఖంలోనే ప్రతిబింబించడం త్రిష స్పెషల్. తీన్ మార్ లో పవన్ ను ప్రేమించినప్పుడూ.. బ్రేకప్ చెప్పినప్పుడూ.. పెళ్లైన తర్వాత.. ఇలా ప్రతి సందర్భంలోనూ తన అందానికి అద్భుత నటనను జోడించి మెప్పించింది.

IHG

 

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో స్టార్ స్టేటస్.. ఓ దశలో నెంబర్ వన్ హీరోయిన్ అయిందంటే త్రిషలో అందానికి తగ్గ నటన ఉండటమే కారణం. ఇన్నేళ్లయినా ఇంకా హీరోయిన్ గా సినిమా అవకాశాలు త్రిషకు వస్తున్నాయంటే ఆమెలో ఉన్న మల్టీ టాలెంటే కారణం. అందుకే హీరోయిన్ గా 50 సినిమాలకు పైగా నటించడమే కాకుండా దాదాపు ప్రతి స్టార్ హీరోతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: