నవ్వుల బ్రహ్మ.. కామెడీ కింగ్.. నవ్వుల రారాజు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. 1000కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో రికార్డులు అందుకున్న బ్రహ్మానందం ఈమధ్య బైపాస్ సర్జరీ వల్ల నటనకు దూరంగా ఉన్నారు. మళ్లీ బ్రహ్మిని తెర మీద చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఆయన నటించాలంటే ఇంకా కొద్దిగా టైం పట్టేలా ఉందని అంటున్నారు. అయితే ఈలోగా బుల్లితెరకు బ్రహ్మి షిఫ్ట్ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.

 

ఇప్పటికే స్టాండప్ కామెడీ అంటూ స్టార్ మా షోలో కొన్నాళ్లు జడ్జ్ గా చేసిన బ్రహ్మానందం ఇప్పుడు ఏకంగా ఓ కామెడీ సీరియల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదో ఒక షోకి వచ్చి చేసి వెళ్లడం వేరు.. కామెడీ సీరియల్ లో నటించడం వేరు. బ్రహ్మితో ఓ క్రేజీ సీరియల్ ప్లాన్ చేస్తున్నారట. దీనిలో బ్రహ్మానందంతో పాటుగా మరో ఇద్దరు స్టార్ కమెడియన్స్ కూడా ఇందులో ఉంటారని తెలుస్తుంది. 

 

ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు.. అయితే రాను రాను బ్రహ్మానందం ను సరిగా వాడుకోవడం రాక ఆయన్ను తప్పించడం చేశారు. కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ మునుపటి ఫాం కొనసాగించేలా ఉత్సాహం చూపుతున్న బ్రహ్మానందం మరికొన్ని సినిమాలు చేసి మరిన్ని నవ్వులు ప్రేక్షకులకు పంచాలని ఆశిద్దాం. ఇక బ్రహ్మి చేయబోయే సీరియల్ కూడా కామెడీతోనే ఉంటుంద్ని తెలుస్తుంది. ఓ ప్రముఖ ఛానెల్ బ్రహ్మానందంతో ఇలాంటి కామెడీ సీరియల్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం బ్రహ్మికి వారు భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారని టాక్. బుల్లితెర మీద బ్రహ్మి ఈ వార్తలో నిజం ఎంత ఉంది అన్నది తెలియాల్సి ఉంది.                           
 

మరింత సమాచారం తెలుసుకోండి: