తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని అంటే అందరు గుర్తు పట్టే పేరే. దాదాపు తెలుగు ప్రేక్షకులందరు ప్రియా వడ్లమాని ని బాగానే ఇష్టపడతారు. ఇక యూత్ ఐతే బాగా అట్రాక్ట్ అవుతారు. అందుకు కారణం హుషారు సినిమాలో తను రొమాంటిక్ గా, హుషారుగా కనిపించిన ఉండిపోరాదే సాంగ్. ఈ సాంగ్ లో ప్రియా వడ్లమాని ని చూసిన యూత్ కి మతిపోయిందనే చెప్పాలి. హాట్ హాట్ గా తడిచిన అందాలతో కుర్రకారుకి చమటలు పట్టించింది. ఈ సినిమాతో బోలెడన్ని అవకాశాలు దక్కించుకుంటుందనుకున్నారు. కాని హుషారు తర్వాత మళ్ళీ కనిపించలేదు పాపం. 

IHG

ఇప్పటి వరకు రేయిన్ చెక్, శుభలేక+లు, హుషారు, ఆవిరి సినిమాలు చేసింది. వీటిలో ఈ తెలుగమ్మాయికి హుషారు, శుభలేక+లు సినిమాలు బాగా పేరు తెచ్చాయి. అయినా ముంబై భామల దెబ్బకి తట్టుకోలేదనే చెప్పాలి. పేరుకే ఉండిపోరాదే అన్నారేగాని మళ్ళి సినిమాలు ఇచ్చి ఉండనివ్వలేదుగా అంటూ నిట్టూర్పుగా మాట్లాడుకుంటుందని అంటున్నారు. అయినా ఈ బ్యూటీ అవకాశాలు రాకపోతాయా అన్న నమ్మకంతో సోషల్ మీడియాలో నిరంతరం ఫాలోవర్స్ ని పెంచుకుంటూ తన హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ టచ్ లో ఉంటుంది.

 

IHG

ఫ్యాన్స్ కూడా ప్రియా వడ్లమాని ని బాగా ఫాలో అవుతున్నారు. తన మీద బాగా క్రేజ్ ని పెంచుకుంటున్నారు. అంతేకాదు చాలామంది ఫ్యాన్స్ కూడా ఎపుడెప్పుడు ఈ బ్యూటీని మళ్ళీ స్క్రీన్ మీద చూస్తామా అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి మన మేకర్స్ ఈ తెలుగమ్మాయిని ఎప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చి తీసుకు వస్తారో చూడాలి. అసలే ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్స్ కి భారీ బడ్జెట్ ఇచ్చి తీసుకునే పరిస్థితి లేదు. అందరి రెమ్యూనరేషన్ లో కోత పెడుతున్నారు. కాదంటే ఇంకో ఆప్షన్ ని చూస్తున్నారు. ఇది ప్రియా వడ్లమాని కి కలిసొస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: