టాలీవుడ్ లో హీరోయిన్స్ కి లైఫ్ టైం చాలా తక్కువన్న సంగతి తెలిసిందే. సంవత్సరంలో కనీసం పది మంది హీరోయిన్స్ పెద్ద సినిమాలతో టాలీవుడ్ లో అడుగుపెడితే కనీసం ఇద్దరు కూడా పట్టుమని పది సినిమాలు చేయడం లేదు. వచ్చామా ఒక సినిమా చేసామా సర్ధుకొని పోయామా అన్నట్టుగా ఉంటోంది వ్యవహారం. యంగ్ హీరో ల కి జంటగా తెలుగు తెరకి పరిచయం అయితే అవుతున్నారు గాని ఆ తర్వాత ఇంకో సినిమాలో అవకాశం రావడానికి నానా తంటాలు పడుతున్నారు. 

 

IHG's next | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

ముంబై, ఢిల్లీ నుండే కాదు తమిళ, మళయాళ, కన్నడ చిత్ర సీమ నుండి దిగుమతి అవుతున్నారు. కాని మళ్ళీ వాళ్ళ ఊరెళ్ళే ఫ్లైటెక్కేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మజిలీ సినిమాలో ఒక హీరోయిన్ గా నాగ చైతన్య సరసన నటించింది దివ్యాంశ కౌశిక్. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో బాగానే పర్ఫార్మ్ చేసింది. కాని మళ్ళీ ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఇంకో సినిమా అవకాశం రాలేదు.

 

IHG

ఇక నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుల్ మోహన్. బాగానే నటించింది. చూడటానికి చక్కగా ఉంది. నాని కూడా మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి..ఖచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని పొగడ్తలతో ముంచేశాడు. కాని ఇప్పటి వరకు మళ్ళీ ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి హీరోయిన్ మరో అమ్మాయి కూడా ఉంది. 

 

IHG

విజయ్ దేవరకొండ హీరోగా యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన సినిమా టాక్సీవాలా. పెద్ద బ్యానర్స్ అయిన గీతా ఆర్ట్స్ 2, యువి క్రియోషన్స్ లో ఈ సినిమాని నిర్మించారు. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి వచ్చింది ప్రియాంక జవాల్కర్. సినిమా హిట్ అయినా ఈ బ్యూటీకి ఛాన్సులు లేవు. సినిమా రిలీజయ్యాక బాగానే యూట్యూబ్ చానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చి హడావుడి చేసింది. కాని అది ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇలాంటి హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కాని ఎందుకనో వీళ్ళు ఒక్క సినిమానే మరో సినిమా ఛాన్సే లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: