ఒకప్పుడు ప్రాంతీయ సినిమాగా మాత్రమే ఉండే తెలుగు సినిమా క్రేజ్ ఇప్పుడు నేషనల్ వైడ్ గానే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా వెళ్లింది. ఇక్కడ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టుల మీద అందరి కన్ను ఉంటుంది. ఇక తెలుగులో కథానాయిక కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలెంట్ ఉన్న వారు ఎక్కువ రోజులు ఉన్నా అది తక్కువ ఉన్న వారు మాత్రం ఒకటి రెండు సినిమాలకే సర్ధేయాల్సి ఉంటుంది. అయితే అనుష్క, కాజల్, తమన్నా, శృతి హాసన్ లాంటి సీనియర్ హీరోయిన్స్సినిమా పడితే ఆ సినిమా చేసే అవకాశం లేదు.

 

అందుకే ఈమధ్య టాలీవుడ్ లో కూడా కొత్త అందాల ఒరవడి మొదలైంది. కెతిక శర్మ, అమృత అయ్యర్, సాయి మంజ్రేకర్, ప్రియా భవాని శంకర్, అనన్య పాండే, కృతి శెట్టి ఇలా యువ హీరోలంతా కూడా కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేస్తున్నారు. వీరే కాదు ఇంకా చిన్న సినిమాలతో చాలామంది హీరోయిన్స్ వస్తున్నారు. కాని ప్రస్తుతానికి యూత్ ఆడియెన్స్ లో కొద్దిగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో వీళ్లంతా ఉన్నారు. పూరి నిర్మాతగా ఆకాష్ పూరి హీరోగా వస్తున్న సినిమాలో తన అందాలతో అలరిస్తుంది ఢిల్లీ భామ కెత్క శర్మ. ఇక మెగా మేనళ్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ చేస్తున్న మొదటి ప్రజేక్ట్ ఉప్పెనలో హీరోయిన్ గా చేస్తుంది కృతి శెట్టి.

 

రామ్ రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో అమృత అయ్యర్, వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో సాయి మంజ్రేకర్. మంచు మనోజ్ అహం బ్రహ్మస్మిలో ప్రియా భవాని శంకర్. పూరి డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఫైటర్ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్య టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ల సందడి బాగుందని చెప్పొచ్చు. మరి వీరిలో ఎవరు తెలుగు ఆడియెన్స్ మనసులు గెలుస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: