బాలీవుడ్ లో అందం తో అయినా నటన లో అయినా సరే ఎవరికి అందని ఎత్తులో ఉంది అనుష్క శర్మ అనే సంగతి అందరికి తెలిసిందే. ఆమెకు నటిగా మంచి ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఏ సినిమా చేసినా సరే నటన విషయంలో ఏ మాత్రం కూడా రాజీ అనేది లేకుండా చేస్తూ ఉంటుంది. ఆమె సినిమాలు ఆమె చేస్తున్న కొన్ని పాత్రలు ఆమెకు చాలా మంచి పేరు ని తీసుకుని వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ధైర్యం గా మరో ఆలోచన లేకుండా పెడుతున్న పెట్టుబడులు కూడా ఆమెకు చాలా వరకు ప్లస్ అవుతున్నాయి అనే చెప్పాలి. 

 

ఇక భర్త విరాట్ కోహ్లీ సహకారం తో ఆమె సినిమాల్లో భారీగానే పెట్టుబడులు పెడుతూ వస్తుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చేస్తున్న కొన్ని కొన్ని పాత్రలు ఆమెను నటిగా మరో రేంజ్ కి తీసుకుని వెళ్ళాయి అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఏ మాత్రం కూడా ఆమె పెట్టుబడి పెట్టే విషయంలో రాజీ అనేది పడటం లేదు అనే చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె గురించి  ఒక వార్త మన తెలుగులో హల్చల్ చేస్తుంది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఆమె మహేష్ బాబు సినిమాలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

ఏమీ లేదు ఆమె రాజమౌళి తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో కాని అది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు జక్కన్న మహేష్ తో సినిమా చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాలో తాను పెట్టుబడి పెడితే మంచిది అనే ఆలోచనలో ఆమె ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇప్పటికే ఆమె చర్చలు కూడా జరిపింది అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: