టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన చాలా తక్కువ కాలానికే స్టార్ హీరోయిన్ గా చాలా మంచి ఇమేజ్ ని తెచ్చుకుంది భూమిక అనే సంగతి అందరికి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా తనకు వచ్చిన ఇమేజ్ ని ఆమె చాలా బాగా కాపాడుకుని సినిమాలు చేసింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆమె నటన విషయంలో మాత్రం ఏ విధంగా కూడా రాజీ అనేది లేకుండా చేసారు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా సరే ఆమె నటన విషయంలో ఏ విధంగా కూడా రాజీ అనేది పడలేదు. 

 

ఎక్కడ అందం చూపించాలో అక్కడ అందం చాలా జాగ్రత్తగా చూపించడమే కాదు నటన విషయంలో అన్ని విధాలుగా ఆమె చాలా వరకు జాగ్రత్తలు పడి సినిమాలు చేసారు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాలను కీలక పాత్రల్లో లైన్ లో పెట్టారు. ఆమె సినిమాలు ఇప్పుడు జనాలకు దగ్గర అవుతున్నాయి. ఆమె వెబ్ సీరీస్ లో కూడా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా బాగానే జరుగుతుంది గాని ఆమె చేస్తుందా లేదా అనేది తెలియదు.  ఆమె అందం చూపించినా సరే ఎక్కడా కూడా చికాకు లేకుండా చూపిస్తూ ఉంటారు. 

 

అలాగే ఆమె మంచి డాన్సర్ కూడా. ఇవన్ని ఆమెకు బాగా కలిసి వచ్చిన అంశాలుగా చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వరుసగా రావడానికి ప్రధాన కారణం అదే అని చెప్పాలి. ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి ఆ సినిమాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: