టాలీవుడ్ లో కి వచ్చిన చాలా తక్కువ కాలానికే స్టార్ హీరోయిన్ గా ఒక రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకుంది సమీరా రెడ్డి. స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఆమెకు చాలా మంచి పేరు తీసుకుని వచ్చాయి. ఎన్టీఆర్ తో ఆమె చేసిన  రెండు సినిమాలు కూడా ఆమెకు మంచి ఇమేజ్ ని తెచ్చాయి గాని ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవడం తో ఆమె సినిమాలు ఇంకా వద్దు అని చాలా మంది ఆమెను అప్పట్లో మీడియా లో కూడా కామెంట్ చేసారు. స్టార్ హీరోల సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం చేయడం లో ఇబ్బంది పడింది అనే చెప్పాలి. 

 

చిరంజీవి తో సినిమా చేసే అవకాశం వచ్చినా సరే ఆమె నటన విషయంలో అంతగా దృష్టి సారించలేదు అని చాలా మంది ఆమెను ఇప్పటికి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఆమె డాన్స్ విషయంలో కూడా అంతగా దృష్టి పెట్టలేదు అని అందుకే ఆమె కెరీర్ ఇప్పుడు ఇబ్బంది పడింది అని చెప్తారు. ఆమె గనుక అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఉంటే ఆమెకు చాలా మంచి ఆఫర్లు ఇప్పుడు వచ్చేవి అని చాల అమంది అంటారు. ఇక ఆమె సినిమాల కంటే కూడా ఇతర విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అని అందుకే ఆమె కెరీర్ బాగా ఇబ్బంది పడింది అని అంటారు. 

 

ఎన్టీఆర్ తో ఆమె నడిపిన ప్రేమ వ్యవహారం ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత మెగా హీరోల మీద ఆమె ఎక్కడో రెండు మూడు సందర్భాల్లో కామెంట్స్ కూడా చేసింది అని అంటారు. అందుకే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు అని చెప్తూ ఉంటారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: