కీర్తి సురేష్... ఈ తరం మహానటి. అవును ఆమె నటించిన సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి సినిమా చూసిన ఎవరు అయినా సరే ఆమెను అదే విధంగా కీర్తిస్తూ ఉంటారు. ఆ సినిమాలో ఆమె నటన చూసిన ఎవరు అయినా సరే ఆమెను అలాగే  నటనలో సావిత్రి తో పోల్చారు అంటే ఆమె ఏ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆమె చాలా బాగా నటించడమే కాదు చాలా అందంగా కూడా కనిపించింది ఆ సినిమాలో. ఆమె నటనకు ఇప్పటికి కూడా జనాలు ఆమెను సినిమా వచ్చి రెండేళ్ళు అయినా సరే కీర్తిస్తారు అనేది వాస్తవం. 

 

సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఆమె నటన సూపర్ సూపర్ హిట్ అయింది. ఇక అంతకు ముందు ఆమెలో మంచి నటి లేదు అని చాలా మంది అన్నారు. కాని ఆ విమర్శలకు ఆమె ఆ సినిమా ద్వారా గట్టి సమాధానం చెప్పింది అని చెప్పాలి. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర నిజంగా ఆమెను దేవతను చేసింది. ఆమె ఎవరూ చేయలేని విధంగా సావిత్రి జీవితాన్ని జీవించి చూపించింది అని సినిమా చూసిన ఎవరు అయినా సరే అనే మాట. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. తెలుగు తమిళ భాషల్లో ఆమె తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు. 

 

ఇటీవల ఆమె నటించిన పెంగ్విన్ అనే సినిమా ఓటీటీ లో విడుదల అయి దూసుకుపోతుంది. ఆమె నటనకు చాల ఆమంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. ఆమె జీవించింది ఆ సినిమాలో అని ఆ సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరో సినిమా ఓటీటీ లో ప్లాన్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: