రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ విజృంభించినప్పటి నుండి తన పంథా మార్చి ఏటీటీ అనే కొత్త కాన్సెప్ట్ ని డెవలప్ చేసి సినిమాలని రిలీజ్ చేస్తున్నాడు. థియేటర్లు మూతబడిన క్రియేటివిటీ ఉన్న వాళ్లని అవేవీ ఆపలేమని, ఎక్కడి నుండైనా సినిమా తీసి రిలీజ్ చేయొచ్చని చెప్పిన వర్మ చేసి చూపిస్తున్నాడు. కరోనా కారణంగా చాలామంది దర్శకులు స్క్రిప్టు రాసుకునే పనిలో ఉంటే వర్మ మాత్రం తనదగ్గరున్న స్క్రిప్టులని తెరమీదకి తీస్తుకొస్తున్నాడు. 

 


ఇప్పటికే కరోనా వైరస్ పై ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ, శ్రేయాస్ ఈటీ ఆప్ ద్వారా క్లైమాక్స్ అని చిత్రాన్ని రిలీజ్ చేసాడు. ఈ సినిమా చూడడానికి వందరూపాయలు ఫీజు పెట్టాడు. క్లైమాక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో వర్మ నగ్నం అంటూ  మరో సినిమాని ముందుకు తెచ్చాడు. 22 నిమిషాల షార్ట్ ఫిలిమ్ చూడడానికి 200రూపాయలు చెల్లించాలని చెప్పాడు. సినిమా చూసిన వారు దానిలో ఏమీ లేదని తేల్చి పారేసారు. అయినా తనకేమీ నష్టం లేదనీ కేవలం రెండు వేల రూపాయలతో సినిమాని తెరకెక్కించానని ప్రచారం చేసాడు.

 

అయితే తాజా సమాచారం ప్రకారం నగ్నం సినిమాకి అంతకన్నా ఎక్కువే ఖర్చయిందని తెలిసింది. ఆ షార్ట్ ఫిలిమ్ లో నటించిన శ్రీ రాపాక వెల్లడించిన దాని ప్రకారం ఆమెకి రెండు లక్షల పారితోషికం ఇచ్చారట. రెండురోజుల పాటు షూటింగ్ జరిగిందని, ఒక గంట డబ్బింగ్ చెప్పానని తెలియజేసింది. మొత్తం సినిమా పూర్తవడానికి పదిహేను రోజుల సమయం పట్టిందట, ఇందులో నగ్నంగా నటించలేదని, కేవలం అలా కనిపించినట్టు చిత్రీకరించారని చెప్పింది. 

 

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ నగ్నం షార్ట్ ఫిలిమ్ కి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే 80లక్షలకి పైగా వసూలు అయ్యాయని అంటున్నారు. కరోనా టైమ్ లోనూ వర్మ బాగానే సంపాదిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: