నేషనల్ అవార్డు విన్నర్ సుహాసిని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. 1980వ సంవత్సరంలో తమిళ సినిమాలో తెరంగేట్రం చేసి అవార్డులను సొంతం చేసుకుంది సుహాసిని. ఆమె తన కెరీర్ తొలినాళ్లలో అశోక్ కుమార్ కి కెమెరా అసిస్టెంట్ గా పని చేసింది. ప్రముఖ హీరోయిన్ లకు మేకప్ ఆర్టిస్ట్ గా కూడా ఈమె పనిచేసింది. తదనంతరం నటీమణిగా అవతారమెత్తి తెలుగు తమిళ కన్నడ మలయాళం చిత్రాల్లో నటించి అశేషమైన కీర్తిని గడించింది. 1981 వ సంవత్సరంలో తెలుగు పరిశ్రమలో అరంగేట్రం చేసిన సుహాసిని చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల సరసన నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. 

 


ఈమె చిరంజీవి బాలకృష్ణ ల తో బాగా రొమాన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. శృంగారభరితమైన పాటల్లో ఆమె తన అందచందాలను విపరీతంగా ఆరబోస్తూ తెలుగు ప్రేక్షకులకు సెగలు పుట్టించింది. కొత్త జీవితాలు సినిమాలో స్కిన్ షో బీభత్సంగా చేసిందని చెప్పుకోవచ్చు. చంద్రమోహన్, శరత్ బాబు నటించిన శిక్ష సినిమాలో చంద్రమోహన్ భార్యగా సుహాసిని నటించింది. ఐతే ఈ చిత్రం లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించిన సుహాసిని నటనకు వందకి వంద శాతం మార్కులు పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. 

 


సంసారం చదరంగం మమతల కోవెల లాయర్ సుహాసిని,  ముక్కుపుడక, స్రవంతి పున్నమి చంద్రుడు కుటుంబ కథా చిత్రాల్లో నటించి సినీ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. శ్రావణ సంధ్య, ముక్కుపుడక సినిమాలో విజయశాంతి, సుహాసిని పోటాపోటీగా నటించారని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ హీరోగా నటించిన మంగమ్మగారి మనవడు చిత్రం లో సుహాసిని హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను పులకరింప జేసింది. దంచవే మేనత్త కూతురా పాటలో ఈమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తళుకుమన్న తార సుహాసిని తన అద్భుతమైన నటనతో అందచందాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: