నిన్నటి తరం హీరోయిన్లలో తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరై... ఎన్నో ఏళ్ల  పాటు స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించి ఎంతగానో గుర్తింపు సంపాదించిన హీరోయిన్లలో ఒకరు టబు. అప్పట్లో హీరోయిన్ టబు కు తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మొన్నటికి మొన్న అలా వైకుంఠపురములో సినిమాలో నటించి ఇప్పటికి కూడా తన క్రేజ్ తగ్గలేదు అని మరోసారి నిరూపించింది, నిన్నటి తరం హీరోయిన్లలో  తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకుంది టబు.


అయితే టబు  ఎక్కువగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే నటించిన విషయం తెలిసిందే. గ్లామరస్ పాత్రల్లో  నటించినప్పటికీ వాటికి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పాలి. అందాల ఆరబోతకు తక్కువగా ప్రాధాన్యతనిస్తూ నటనకు ప్రాధాన్యం ఉన్న వైవిద్యాత్మకమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. పాత్రకు తగ్గట్టుగా అభినయం హావభావాలు నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది నిన్నటితరం హీరోయిన్ టబు.


 ఎలాంటి పాత్రలో అయిన  తన  నటనతో ఎంతగానో ఆకట్టుకుంది, ఓ వైపు తన అభినయంతో ఆకట్టుకుంటూనే నటిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించింది. అంతేకాదు ఉత్తమ నటిగా టబు  జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. ఇలా తన నటనతో ఎంతోమందిని మెప్పించి తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించింది నిన్నటితరం హీరోయిన్ టబు. దాదాపు స్టార్ హీరోలందరి సరసనా నటించి చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు తన హవాని నడిపింపించింది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠ పురములో సినిమాలో  అల్లు అర్జున్ తల్లి  పాత్రలో నటించిన టబు మరోసారి తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అనే చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: