పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక పని చేపట్టాడు అంటే ఎప్పుడు సంచలనమే. కరోనా విపత్తు నుండి ప్రజలను కాపాడమని దేవుడిని వేడుకొంటూ నాలుగు నెలలపాటు చాతుర్మాస్య దీక్ష పవన్ చేపట్టడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో అదేవిధంగా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు దీక్షను ప్రారంభించి కార్తీక శుక్ల ఏకాదశి నాడు విరమిస్తాడని తెలుస్తోంది. 


ఈ దీక్షను విరమించే సమయంలో ఒక పవిత్ర హోమం చేసే ఆలోచనలు కూడ పవన్ కు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దీక్ష సమయంలో పవన్ ఒంటిపూట మాత్రమే తింటూ కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకుంటాడని టాక్. గతంలో ఇదేవిధంగా  ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆ బాధతో పవన్ 11 రోజుల పాటు అన్నం తినడం మానివేసిన విషయం తెలిసిందే.  


ఇప్పడు ఈ చాతుర్మాస దీక్ష వార్తలు బయటకు రావడంతో కొందరు పవన్ వ్యతిరేకులు ఈ దీక్షను కూడ టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక సమస్యలతో ఈ కరోనా సమయంలో పోరాడుతున్న పరిస్థితులలో వారికి ధైర్యం కలిగించే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయకుండా ఇలా దీక్షలు చేస్తే ఏమి వస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విధానాలు చేస్తున్న కామెంట్స్ భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన ఆర్ ఎస్ ఎస్ కు దగ్గరగా ఉన్న పరిస్థితులలో ఈ చాతుర్మాస్య దీక్ష నిర్ణయం కూడ ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో పవన్ తీసుకున్నాడా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో పవన్ కు జాతకాలు ముహూర్తాల పై నమ్మకాలు పెరిగిపోవడంతో పవన్ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు అని మరికొందరి అభిప్రాయం. పవన్ దీక్షకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో పవన్ కార్తీక మాసం వెళ్ళేదాకా ‘వకీల్ సాబ్’ షూటింగ్ ను ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్లే అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: