టాలీవుడ్లో చాలా మంది సీనియర్ హీరోయిన్లు  తమ అందాలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించటం తో పాటు తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న వారు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే, మొదట నటనతో అంత మెప్పించకపోయినా.. ఆ తర్వాత కాలంలో మాత్రం తమా నటనతో ప్రేక్షకులందరినీ ఫిదా చేసిన హీరోయిన్ లు  కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు శ్రీయ. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉంది.


 దాదాపుగా దశాబ్దకాలంపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఈ అమ్మడి అందాలకు ఇప్పటికికూడా తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే శ్రీయా  మొదటి నుంచీ ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించింది. తన అందాల ఆరబోతతో తెలుగు చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది. తన అందాలతో సినీ ప్రేక్షకులు అందరిని  నిద్రలేని రాత్రులు గడిపేలా చేసింది. గ్లామర్ పాత్రలో ఎంతగానో ప్రభావితం చేసిన శ్రియ మొదట తన నటనతో మెప్పించలేకపోయింది.



 కానీ అటు వెంటనే నటనలో కూడా పుంజుకుని... నటిగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది శ్రీయ. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. ఎన్నో  గ్లామర్ పాత్రల్లో నటిస్తూ అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులని ఆకర్షిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తన హవా నడిచింది శ్రీయ, ఇప్పుడు వరకు శ్రీయా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించింది అని చెప్పాలి, శ్రీయ  నటించిన ఎన్నో పాత్రలు తనకు నటిగా  ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టాయి, ఇలా అందాల దేవత గా, ఒక గొప్ప నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో హవా నడిపించింది శ్రీయ.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: