తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తనదైన నటనతో అందంతో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతు ఉంటారు. అయితే మొదట గ్లామర్ పాత్రలో మెరిసి ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుని బాగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్ లు  కొంతమంది అయితే... మొదటినుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ అందాల ఆరబోతకు దూరంగా ఉండి  క్రేజ్ సంపాదించిన హీరోయిన్ లు  కొంతమంది. అయితే మొదటి నుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతుంది రష్మిక మందన.



 తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన అతి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది.  ముఖ్యంగా ఈ అమ్మడి ఆటిట్యూడ్ నటనతో ఎంతగానో క్రేజ్ సంపాదించింది అని చెప్పాలి. మొదటి నుంచి అందాల ఆరబోతకు దూరంగానే ఉంది రష్మిక మందన. ఇక ఇప్పటి వరకు రష్మిక చేసిన సినిమాలలో తాను పోషించిన పాత్రలన్ని  నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే అని  చెప్పాలి.



ఇలా మొదటి నుంచి తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది రష్మిక మందన, అదేసమయంలో తన అభినయంతో కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేవలం చిలిపి నవ్వుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది  ఈ ముద్దుగుమ్మ. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. ఇలా నటనతో అందంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపిస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక మందన.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: