ఇండియన్ ఫిల్మీ లెజండ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను దర్శకత్వం వహించే అవకాశం వస్తే ఎవరికైనా సువర్ణావకాశమే. ఇప్పటితరం కూడా ఆయన తమ సినిమాలో నటించాలని కోరుకునేవారే. కానీ.. ఇండియన్ సెన్సేషనల్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మతో సినిమాకు బచ్చన్ సాబ్ పెద్దగా టైమ్ తీసుకోలేదు. అప్పట్లో ఆర్జీవీ హవా అది. మెస్మరైజింగ్ కథతో అమితాబ్ ను ఒప్పించి మెయిన్ లీడ్ లో సినిమా చేశాడు. ఆ సినిమానే ‘సర్కార్’. నేటితో ఆ అద్భుతం ఆవిష్కృతమై 15ఏళ్లు పూర్తయ్యాయి. వయసుకు తగ్గ పాత్రలో అమితాబ్ మరోసారి తన మ్యాజిక్ చూపించారు.

IHG

 

సర్కార్ సిరీస్ లో మొదటి సినిమాగా 2005 జూలై 2న విడుదలైంది సర్కార్. పూర్తి రాజకీయ కోణంలో తెరకెక్కింది. 1972లో వచ్చిన ది గాడ్ ఫాదర్ ఆధారంగా ఈ సినిమా తీశాడు వర్మ. ముంబయిలో పెద్ద డాన్ గా అందరూ అమితాబ్ ను ‘సర్కార్’ గా పిలిచుకుంటారు. వృత్తి, రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తుకుపై ఎత్తులతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీనికి వర్మ స్థాయి మార్క్ టెక్నిక్, టేకింగ్ తో సినిమా రేంజ్ ను మార్చేశాడని చెప్పాలి. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ కూడా నటించాడు. ఈ సినిమాలో విలన్ పాత్రకు తెలుగు నటుడు కోట శ్రీనివాసరావే చేయాలని పట్టుబట్టి చేయించాడు వర్మ.

IHG

 

ఈ సందర్భంగా అమితాబ్ కూడా ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘కొన్ని జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. కాలం గడిచిపోయినా గుర్తులు పదిలంగా ఉంటాయి’ అని అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. దీనికి ఆర్జీవీ.. ‘15ఏళ్లయినా సర్కర్, బచ్చన్ సింహం, పులి కలగలిపిన గాంభీర్యంతోనే ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ తో ఈ సిరీస్ లో సర్కార్ రాజ్, సర్కార్-3 సినిమాలు వచ్చాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: