టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తారక్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన ఫాన్స్ కి ఒక రేంజ్ లో పండగ. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన నటన కోసం కూడా జనాలు అదే రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉంటుంది అతనికి దర్శకుడు ఇచ్చిన బాధ్యత ఏంటీ అంటూ జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు అతను చాలా వరకు బాలీవుడ్ కి వెళ్ళే అవకాశాలే దాదాపుగా కనపడుతున్నాయి. బాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ కి ఓకే చేసాడు. 

 

బన్సాలి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని తారక్ లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి స్పష్టత లేదు గాని ఈ ప్రాజెక్ట్ లో మాత్రం తారక్ ని చూసి ఫాన్స్ పండగ చేసుకుంటారు అని అంటున్నారు సినీ జనాలు. నిజం ఎంత అనేది తెలియదు గాని ఈ సినిమాలో తారక్ ఒక ముస్లీం రాజు గా కనపడే అవకాశం ఉంది అని సమాచారం. ముస్లీం రాజు పాత్ర లో అతను చేసే సూచనలు ఉన్నాయి అని బాలీవుడ్ వర్గాలు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రణవీర్ సింగ్   కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది అనే సంగతి అందరికి తెలిసిందే.

 

ఈ సినిమాలో ఆయన హిందు రాజు గా నటించే సూచనలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి మరి. ఇది ఎంత వరకు నిజం అసలు ఏంటీ కథ అనేది చూడాలి అంటే కచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు తారక్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: