టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల కోసం జనాలు ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్  గురించి ఒక్క వార్త వచ్చినా సరే జనాలు మాత్రం మిస్ అవకుండా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతీ వార్త కూడా హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పుడు మన తెలుగు లో ఒక సినిమా విషయంలో  ఇప్పుడు చాలా చర్చలే నడుస్తున్నాయి. స్టార్ హీరో చేస్తున్న ఆ సినిమా గురించే ఈ వార్తలు అన్నీ కూడా. ఆ సినిమానే పుష్ప. ఈ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ పడుతున్న కష్టమే ఇప్పుడు హైలెట్ అవుతుంది. 

 

అతను ఈ సినిమాలో...  ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే మొదలు పెడుతున్నారు.  ఆ పాత్ర కోసం  అల్లు అర్జున్ ఇప్పుడు చాలా వరకు శిక్షణ తీసుకుంటున్నాడు అని సమాచారం.  తమకు ఉన్న ఒక ఫాం హౌస్ లో అతను ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి శిక్షణ తీసుకునే ప్రయత్నం లో ఉన్నాడు అని టాక్. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... అతను గొడ్డలి విసిరే సీన్ కోసం చాలా కష్టపడుతున్నాడు అని టాక్. ఆ సీన్ ని డూప్ లేకుండా చేసే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నాడు అని అంటున్నారు. 

 

అందుకే బన్నీ ఆ పాత్ర కోసం చాలా వరకు కూడా కష్టపడి మరీ చేస్తున్నాడు అని అంటున్నారు. నిజం ఎంత అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఇప్పుడు అతను చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత మరో తమిళ సినిమాను చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: