పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫాన్స్ కి ఒక రేంజ్ లో పిచ్చి అనేది ఉంటుంది. సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాలో ఆయన ఏ పాత్ర చేస్తున్నాడు, హీరో గానే ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అనే ఆసక్తి ఫాన్స్ లో ఎక్కువగా ఉంటుంది ఇక పవన్ సినిమా కోసం టాలీవుడ్ లో ఉన్న  హీరోలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే వారి సినిమాలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది అని స్పష్టంగా చెప్పవచ్చు. 

 

ఇప్పుడు  పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది అని అంటున్నారు. అయితే ఆ  సినిమాను విడుదల చేయడానికి ముందు ఇప్పుడు పవన్ ఆచార్య సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు అని సమాచారం.  ఆచార్య సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఆచార్య సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి పూర్తి చేస్తే సినిమా దాదాపుగా అయిపోయినట్లే. 

 

ఆ సినిమాను విడుదల చేసే విషయంలో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాని పరిస్థితి లో చిత్ర యూనిట్ ఉంది. అవును ఎప్పుడు విడుదల చెయ్యాలో తెలియడం లేదు. ఆ సినిమాను గనుక సంక్రాంతికి విడుదల చేస్తే పవన్ తన సినిమాను వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ మరి. దీనికి సంబంధించి ఇప్పుడు చాలానే చర్చలు  జరుగుతున్నాయి. పవన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని అన్నయ్య సినిమా ఆధారంగా విడుదల చేసే ఛాన్స్ ఉండటం తో జనాలు కూడా అసలు ఎం జరుగుతుందా అనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: