క్రియేటివ్ ద‌ర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ రంగస్థలం సినిమాలో ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టించిన స‌మంత చేసిన న‌ట‌న‌కు దేశ వ్యాప్తంగా అదిరిపోయే ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌మంత పాత్ర చాలానే ఉంద‌ని చెప్పాలి. ఇక పెళ్ల‌య్యాక కూడా సెల‌క్టివ్ గా పాత్ర‌లు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతోన్న స‌మంత గ‌తేడాది కూడా రెండు  సూప‌ర్ డూప‌ర్ హిట్లు త‌న ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో స‌మంత న‌ట‌న‌కు ఫిదా అవ్వ‌ని తెలుగు సినిమా ప్రేక్ష‌కుడు ఎవ్వ‌రూ ఉండ‌రు.

 

ఈ క్ర‌మంలోనే రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ మాట్లాడుతూ త‌న‌కు స‌మంత‌తో చాలా సినిమాలు చేయాలనుందని చెప్పాడు. చెప్పినట్టుగానే తన తర్వాత సినిమా కోసం కూడా ముందుగా సమంతనే సుకుమార్ సంప్రదించాడట.  ప్ర‌స్తుతం సుకుమార్ తీస్తోన్న పుష్ప సినిమా కోసం సైతం హీరోయిన్ రోల్ కోసం ముందు ఆమెనే సంప్ర‌దించాడ‌ట‌.

 

పుష్ప కూడా ఓ పీరియాడిక‌ల్ స్టోరీతో తెర‌కెక్క నుండ‌డంతో సుకుమార్ స‌మంత‌ను సంప్ర‌దిం చి సుక్కు క‌థ చెప్పినా... ఆమె ఈ సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి చూప‌లేద‌ట‌. గ‌త డిసెంబ‌ర్‌లోనే సుక్కు సమంత‌ను క‌లిసినా ఆమె మాత్రం ఇప్ప‌ట్లో సినిమాల‌కు కాస్త బ్రేక్ తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉండ‌డంతోనే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన‌ట్టు చెపుతున్నారు. అందుకే స‌మంత ప్లేస్‌లోకి రష్మిక వచ్చి చేరింది.  అలా బ‌న్నీకి స‌మంత షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: