టాలీవుడ్ లో సీనియర్ హీరో వెంకటేష్ సినిమాలు అనగానే యువతలో మంచి క్రేజ్ అనేది ఉంటుంది. చాలా సైలెంట్ గా సినిమాలు చేస్తూ ఆయన ఎవరి తో కూడా సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్నారు. ఆయన రాబోయే రెండు మూడేళ్ళకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. నారప్ప అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇక ఏ పాత్రలో అయినా సరే ఆయన చేయడానికి గానూ రెడీ గా ఉన్నారు అనే విషయం అందరికి ఒక స్పష్టత అయితే వచ్చింది అనే చెప్పాలి. 

 

ఇప్పుడు నారప్ప అనే సినిమాలో ఆయన చాలా వరకు కొత్తగా నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త టాలీవుడ్ లో  చక్కర్లు కొడుతుంది. అది ఏంటీ అంటే ఆయన బాలీవుడ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ ని ఓకే చేసారు అని సమాచారం. అక్కడ ఆయన సినిమా చేయడానికి గానూ   రెడీ అయ్యారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు అని అన్నీ ఓకే అనుకుంటే ఆయన ఆ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది అని సమాచారం. 

 

మరి అది నిజమా కాదా అనేది తెలియాలి అంటే కచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. ఇప్పుడు ఆయన చేస్తున్న నారప్ప లో ఆయన భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ ముగ్గురు పిల్లలకు తండ్రి గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా  తర్వాత ఆయన తమిళంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని సమాచారం. చూడాలి ఆ సినిమాను ఎప్పుడు లైన్ లోకి తీసుకుని వెళ్తారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: