మన తెలుగులో ధైర్యంగా సినిమాలు చేసే నటుల్లో బాలయ్య కూడా ఒకరు. ఆయన సినిమాలు జనాలకు కాస్త నచ్చుతాయి కాబట్టి ఆయన కూడా సినిమాల విషయంలో ఏ మాత్రం ఆలోచన లేకుండా చాలా వేగంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఇమేజ్ కి కాస్త ఇబ్బంది అనేది వచ్చింది. కథల విషయం లో ఏ మాత్రం జాగ్రత్తలు లేకుండా సినిమాలను ఓకే చేయడం తో ఆయన సినిమాలను చూడటానికి గానూ ప్రేక్షకులు అంతగా ముందుకు రావడం లేదు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆయన కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటి వరకు ఆయన హీరో పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇక నుంచి ఆయన సినిమాల విషయంలో ఏ  పాత్రలో అయినా సరే నటించాలి అనే నిర్ణయం తీసుకున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కేవలం హీరో మాత్రమే  కాకుండా  హీరోయిన్ తండ్రి గా కూడా ఆయన నటించే అవకాశం ఉందని హీరో తండ్రి గా కూడా ఆయన చేసే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

వయసు కి తగిన విధంగా ఆయన సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్నారు అని సమాచారం. వయసు దాచుకోకుండా బాలయ్య ముందుకు వెళ్తారు. ఇప్పుడు నటన విషయంలో కూడా ఆయన అదే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక తన సినిమాలలో ప్రేమ కథలు వద్దు అని కూడా ఆయన చెప్పారు అని ఇక నుంచి పెళ్లి అయిన వ్యక్తిగానే తాను నటిస్తాను అని చెప్పారు అని సమాచార౦. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాలో కూడా ఆయన అదే విధంగా చేస్తున్నారు అని టాలీవుడ్ లో  టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: