మన తెలుగు లో చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా సరే నివేదా థామస్ కి చాలా మంచి గుర్తింపు  అనేది వచ్చింది. పాప సినిమాల విషయంలో టాలీవుడ్ జనాలు కాస్త ఎక్కువగానే ఆసక్తి అనేది చూపించారు అనే చెప్పాలి. ఆమె కూడా చాలా వరక జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వచ్చింది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో కూడా చేసే ఆలోచనలో ఉంది అనే టాక్ వినపడుతుంది గాని అది ఎంత వరకు నిజం అనేది చెప్పలేని పరిస్థితి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం ఆమెను ఇంట్లో సినిమాలు వద్దు అని చెప్పారు అని అందుకే ఆమె సినిమాలకు దూరంగా ఉంది అని అంటున్నారు. ఇటీవల ఆమె ఒక పాత్ర ఓకే చేసింది అని ఆ పాత్ర  ఇంట్లో వాళ్లకు అసలు ఏ మాత్రం కూడా నచ్చలేదు అని అందుకే ఆమెను వద్దు అని అన్నారు అంటున్నారు టాలీవుడ్ జనాలు. దీనిపై ఎంత వరకు నిజం అనేది ఎవరికి క్లారితి లేదు గాని ఆమె మాత్రం ఇప్పుడు సినిమాలకు చాలా వరకు దూరంగానే ఉంటుంది అనే  విషయం మాత్రం అందరికి తెలుసు. 

 

మరి ఎప్పుడు ఆమె సినిమాలు చేస్తుంది అనేది చూడాలి. ఇక రాబోయే రెండేళ్ళు కూడా ఆమె చాలా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కూడా అంటున్నారు. చూడాలి ఆమె ఏ  విధంగా సినిమాలు చేస్తుంది అనేది. కాగా టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే హీరోయిన్ లకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్ప్పవచ్చు. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: