మన తెలుగు వాడు కాకపోయినా సరే ప్రభుదేవా విషయంలో మాత్రం జనాలకు ఎప్పుడు తెలుగు లో ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన సినిమాలు ఆయన నటన విషయంలో ఆయన డాన్స్ విషయంలో జనాలకు ఎప్పుడు కూడా ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఆయన చేసే పాత్రలు ఆయన చేసే డాన్స్ కి  జనాలు కాస్త ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. ఇక దర్శక నిర్మాతగా కూడా ఆయన తన టాలెంట్ ని తెలుగు జనాలకు బాగానే చూపించారు అనే చెప్పాలి. స్టార్ హీరో అనే పేరు కూడా ఆయనకు వచ్చేసింది అనేది వాస్తవం. 

 

ఆయన నటన విషయంలో కూడా ఎక్కడా కూడా రాజీ అనేది లేకుండా చేస్తారు. ఇక ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది. ఆయన  రామ్ చరణ్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఒక సినిమాను తమిళ తెలుగు భాషల్లో చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు మరి. నిజమా కాదా అనేది తెలియదు గాని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆయన ఇటీవల రామ్ చరణ్ తో మాట్లాడారు అని ఆయన కూడా అదే విషయం ఓకే చెప్పారు అని అంటున్నారు. 

 

రామ్ చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు అని టాక్ మరి. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాతనే ఆ సినిమాలో ఆయన చేసే అవకాశం ఉంది అని ఇప్పుడు  అయితే రామ్ చరణ్ మాత్రం ఖాళీ గా అసలు లేరు అని మరి వచ్చే ఏడాది అయినా సరే ఆయన ఖాళీ అవుతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: