తెలుగు నుండి చిన్న సినిమాలు థియేటర్ విడుదల స్కిప్ చేసి డైరెక్ట్ గా ఓటిటి ల్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా మొదటి సినిమాగా అమృతరామమ్ విడుదలకాగా ఈ చిత్రం నిరాశపరించింది. ఈసినిమా తరువాత ఇటీవల రెండో సినిమాగా విడుదలైన క్రిష్ణ ఆండ్ హిస్ లీల మాత్రం అదరగొట్టింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈచిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రావడంతో వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. ఈనెల 4న ఈసినిమా తెలుగు ఓటిటి ఆహాలో కూడా స్ట్రీమింగ్ కానుంది. కొద్దీ రోజుల క్రితం సత్యదేవ్ నటించిన 47డేస్ కూడా విడుదలకాగా ఈ చిత్రం డిజాస్టర్ అనిపించుకుంది. 
 
ఇక రేపు భూనుమతి రామకృష్ణ నాలుగో సినిమాగా విడుదలవుతుంది. ఆహా ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. నవీన్ చంద్ర నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే వున్నాయి. ఈ సినిమాలతో పాటు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కూడా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కానుందని తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఈచిత్రాన్ని 4కోట్లకు కొనుగోలు చేసిందట. ఈనెల 15నుండి ఈచిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లో ఉంచనుంది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రంలో సత్యదేవ్ హీరోగా నటించగా నరేష్ , హరిచందన ,సుహాస్  కీలక పాత్రల్లో నటించారు. ఆర్కా మీడియా నిర్మించింది.
 
నిజానికి ఈసినిమా ఏప్రిల్17న థియేటర్లలో విడుదలకావాల్సివుండగా కరోనా వల్ల వాయిదాపడింది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో మేకర్స్ డైరెక్ట్ గా ఓటిటి విడుదలకు మొగ్గుచూపారు. మరి మళయాలంలో స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ మహేషింటే ప్రతీకారంకు రీమేక్ గా తెరకెక్కిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ఎలాంటి రెస్పాన్స్ తెచుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: