దబాంగ్ సినిమాతో దిగిన  బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా బాలీవుడ్ వెటరన్ హీరో శత్రుఘ్న సిన్హా ముద్దుల కూతురు అని తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. దాంతో ఓ దశలో బాలీవుడ్లో టాప్ రేంజికి వెళ్ళిపోయింది. బొద్దుగా ఉన్నా భలే అన్నారు. ఆమె చెప్పిందే మాట, ఆడిందే ఆట, చూపిందే బ్యూటీ అన్నట్లుగా ఏలింది. ఆ తరువాత పోటీ పెరిగింది. సోనాక్షికి అవకాశాలు మెల్లగా తగ్గాయి. ఇక అందాలను చూపించను అన్న షరతు కూడా ఆమెకు పెద్ద మైనస్ అయిందిట.

దాంతో సోనాక్షి అందం వెలవెలగా తోచించి బాలీవుడ్ మేకర్స్ కి. ఆమెను పక్కనపెట్టేసి కొత్తందాల వైపు వెళ్లారు. దాంతో అమ్మడుకు ఇపుడు ఆఫర్లు లేకుండా పోయాయి. దీంతో సోనాక్షి డైరీ ఖాళీగా ఉందిట. డేట్స్ ఇస్తానన్నా కూడా ఎవరూ ముందుకురావడంలేదుట. దాంతో ఈ అమ్మడు కొత్త ట్రిక్కులేస్తొందిట. నా అందాలు అలాగే ఉననయి.ఎక్కడా తగ్గలేదు, సొగసుల సెగలు చల్లారలేదు అని చెప్పుకుంటోంది. ఒకనాడు పరదాల మాటున పరువాలు దాచి ఊరించిన సోనాక్షి ఇపుడు అందాల ఆరబోతకు రెడీ అంటోంది. పైగా ఇన్స్టాగ్రాం లోనూ, సినిమా మాగ్ జైన్ల మీద ఒంపులను, సొంపులను ఒలకబోస్తోంది.

చూడండి తనివి తీరా అంటూ కవ్విస్తోంది. ఆమె పిక్స్ ఇపుడు కుర్రకారుని తెగ రెచ్చగొడుతున్నాయి. ఇన్ని అందాలు ఎందుకు దాచావు బ్యూటీ అంటూ యూత్ గుండెలు లటుక్కున్న జార్చేసుకుంటూ వేదన పడిపోతున్నారుట. సరే ఇంతవరకూ బాగున్నా ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఈ వైపుగా చూడకపోవడంతో సోనాక్షి స్కిన్ షో కి పెద్దగా గిట్టుబాటు కావడంలేదు అంటున్నారు. అపుడెపుడో టాలీవుడ్లో ఆఫర్లు భారీ గా ఇచ్చి రమ్మంటే రాలేదు ఈ ముద్దుగుమ్మ. ఇపుడు సౌత్ అయినా ఓకే అంటోందిట. మరి టాలీవుడ్ అయినా పలకరిస్తుందా. చూడాలి.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: