తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన తమన్నా తర్వాత తెలుగు, తమిళ్ లో మంచి ఛాన్సులు కొట్టేసింది. ఆ తర్వాత హిందీ లో కూడా తన సత్తా చాటింది. బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించింది.   ఈ మద్య బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత బాలీవుడ్ లో సహనటులు అతని మరణం ‘బంధుప్రీతి’ తోనే జరిగిందని అంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనీ ప్రముఖులు దీనిపై తన అభిప్రాయాలను వెల్లడించగా... తాజాగా నటి తమన్నా ఈ అంశంపై స్పందించింది.

 

తన కుటుంబంలో అందరూ డాక్టర్లే అని.. ఇండస్ట్రీ గురించి తెలిసిన వారు తక్కువ అని అన్నారు. అలా తనకు సంబంధం లేని ఫీల్డ్ కి ఎంట్రీ ఇచ్చానని అన్నారు. ముంబై అమ్మాయినైన తాను తెలుగు, తమిళ సినిమాలను చేయడం ప్రారంభించినప్పుడు తనకు ఈ భాషలు కూడా తెలియవని అంది. తన ప్రతిభ, నిబద్ధతను చూసి తనకు అవకాశాలను ఇచ్చారని తెలిపింది.

 

తన విజయాలకు, తన పరాజయాలను తానే కారణమని చెప్పింది.  బంధు ప్రీతి ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా ఉంటుందని.. కానీ మన టాలెంట్ ఎక్కడైనా గెలిపిస్తుందని అన్నారు. టాలెంట్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమని తెలిపింది. తన పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తామంటే తాను ఎంకరేజ్ చేస్తానని చెప్పింది. ఇండస్ట్రీలో హిట్.. ఫ్లాప్ రెండింటిని సమానంగా చూసినపుడే మంచి నటులుగా రాణిస్తారు అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: