సినిమాల ద్వారా మనోభావాలు దెబ్బతినడం, ఆ తర్వాత సినిమాలో నుండి మనోభావాలకి సంబంధించిన సీన్లో, పేర్లో తీసేయడం కూడా మామూలే. గత కొన్ని రోజులుగా మనోభావాల ఇష్యూ చాలా నార్మల్ అయిపోయింది. ప్రతీ సినిమాకీ ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని సార్లు మేకర్స్ జనాల అటెన్షన్ కోసం కూడా ఇలాంటి చేస్తుంటారని అంటారు. అయితే అదంతా పక్కన పెడితే, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అవబోతున్న సినిమాకి మనోభావాల దెబ్బ పడింది.

IHG

 

అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర హీరోగా, అందాల భామ సలోని లుత్రా హీరోయిన్ గా చేసిన భానుమతి రామక్రిష్ణ సినిమా జులై 3వ తేదీ నుండి ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రస్తుతం చిక్కుల్లో ఇరుక్కుంది.

 

 

అయితే ఆ చిక్కులకి కారణం సినిమా టైటిల్.. భానుమతి రామక్రిష్ణ అనే టైటిల్ ని మార్చాలంటూ అలనాటి హీరోయిన్ భానుమతి రామక్రిష్ణ కుమారుడు చెన్నై కోర్టులో పిటిషన్ వేసాడు. వాళ్ల అమ్మగారి పేరుని అనుమతి లేకుండా వాడుకుంటున్నారంటూ వేసిన పిటిషన్ కి కోర్టు, సినిమా పేరుని మార్చుకోమని సూచించిందని చెబుతున్నారు. దాంతో చిత్రబృందానికి మరో అవకాశం లేకుండా పోయింది. 

 

 

అయితే భానుమతి రామక్రిష్ణ అన్న టైటిల్ ని భానుమతి అండ్ రామక్రిష్ణగా మార్చనున్నారట. 30ఏళ్లు నిండిన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య కలిగే ప్రేమని చూపించబోతున్న ఈ సినిమా ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: