ఇంటిల్లపాదీ కలసి సినిమా చూసినట్టు ఇప్పుడు సీరియల్స్ ను కూడా చూస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చే సీరియళ్లు కొన్నయితే.. ఆసక్తితో వాటికోసమే రోజులో టైమ్ కేటాయించేలా చేసే సీరియళ్లు కొన్ని. ఈ రెండో కోవలోకి చెందిన సీరియల్ ‘స్టార్ మా’లో ప్రసారమయ్యే ‘కార్తీకదీపం’. ఈ సీరియల్ కు చిన్నా పెద్దతో సంబంధం లేకుండా అభిమానులెక్కువ. వీరిలో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా చేరిపోయాడు. కథలో భావోద్వేగ అంశంపై తన భావాన్ని వ్యక్తం చేయడం విశేషం.

IHG

 

‘ఎందుకమ్మా అంత మంచి డాక్టర్ బాబు కి ఇంత మంచి వంటలక్క అంటే కోపం’ అంటూ ఓ ఎమోజీకి తన మార్క్ ఎక్స్ ప్రెషన్ పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వెన్నెల కిశోర్ ట్వీట్ కు స్టార్ మా చానెల్ స్పందించింది. ‘త్వరలోనే డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్నిఅర్ధం చేసుకుంటారని కోరుకుందాం కిశోర్ గారూ..’ అంటూ హ్యాపీ ఎమోజీ సింబల్ తో రీట్వీట్ చేశారు. ఈ సీరియల్ ఎంత పాపులరో ఈ రెండు ట్వీట్సే చెప్తున్నాయి. లాక్ డౌన్ వల్ల మొన్నటివారకూ ప్రసారం కాని సీరియల్ ఇప్పుడు ప్రసారమవుతోంది. అయినా.. వెన్నెల కిశోర్ కథలో మెయిన్ ప్లాట్ పై స్పందించాడంటే ఎప్పటినుంచో ఆ సీరియల్ చూస్తున్నాడనే కదా.

IHG'Karthika Deepam' to 'Bigg Boss': The saga of soaps - The Hindu

 

మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి కూడా ఈ సీరియల్ కు ఎంత ఫ్యానో గతంలో ఓసారి చెప్పుకొచ్చారు. ఈ సీరియల్ లో భార్యభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చి విడివిడిగా ఉంటారు. ఇద్దరు కవల పిల్లల మధ్య బంధం.. వెరసి ఓ మంచి ఫ్యామిలీ కాన్సెప్ట్ తో సక్సెస్ అయింది. వంటలక్క పాత్ర మరీ ఫేమస్. మొత్తానికి వెన్నెల కిశోర్ డౌట్ క్లియర్ చేయడం కాదు కానీ.. ఈ సీరియల్ ఎంత ఫేమస్సో మరోసారి నిరూపణైంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: