మహేష్ బాబు సూపర్ స్టార్ క్రిష్ణ కుమారుడిగా వచ్చి తండ్రి స్థాయిని చేరుకోవడమే కాదు, తండ్రిని ఫ్యాన్స్ ప్రేమించి ఇచ్చిన సూపర్ స్టార్ బిరుదుని కూడా సొంతం చేసుకోవడం అంటేనే మహేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. మహేష్ బాబు ఎన్నో హిట్స్ ఇచ్చాడు, ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే మహేష్ ఇపుడు మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు.

IHG

అదేంటి అంటే ట్విట్టర్ లో ఫాలోవర్స్ ని కోటి మందిని దక్కించుకుని తనకు దగ్గరలో సాటీ పోటీ లేదని నిరూపించుకున్నాడు. మహేష్ బాబు లేటెస్ట్ గా 10 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించి తన సత్తా చాటాడు. ఇది సౌతిండియాలోనే సరికొత్త రికార్డు అంటున్నారు. 

IHG

మహేష్ దాదాపు పదకొండేళ్ళుగా ట్విట్టర్ లో ఉంటూ సాధించిన విజయంగా చెప్పాలి. అసలు సినిమా పరిశ్రమ కళ్ళు తెరవకముందే మహేష్ సోషల్ మీడియా పట్లు పట్టేశాడు. దాని ఫ్యూచర్ కూడా ముందే గ్రహించి నాడే పాగా వేశాడు.అందువల్లనే మహేష్ సూపర్ స్టార్ గా ఉంటూనే తన కీర్తి కిరీటంలో మరో క్రెడిట్ ని జత చేసుకున్నాడు. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SRIMANTHUDU' target='_blank' title='srimanthudu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>srimanthudu</a> 100 Million Views On <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YOUTUBE' target='_blank' title='youtube-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>youtube</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POSTERS' target='_blank' title='poster-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>poster</a> ...

మహేష్ బాబు తరువాత ట్విట్టర్ ఫాలోవ‌ర్స్ ఎక్కువగా కలిగిన వారిలో తమిళనాట ధనుష్ కనిపిస్తున్నాడు.ఆయనకు తొమ్మిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అదే విధంగా తరువాత స్థానంలో అక్కినేని వారి కోడలు సమంత ఉంది. ఆమె 80 లక్షల ఫాలోవర్స్ తో ఉంది. ఇక మిగిలిన హీరోలంతా అర కోటి లోపే మిగిలిపోయారు. అంటే మహేష్ బాబు ట్విట్టర్ లో తన సత్తా ఎలా చాటాడో అర్ధమవుతోంది.

IHG scores 10th consecutive $1 million - tollywood

మహేష్ ఫ్యాన్స్ ని రెగ్యులర్ గా కలుస్తూ వారితోనే ఆయన ముచ్చట్లు పెడుతూ ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూ చేసిన దాని ఫలితం ఇది అంటున్నారు. నిజంగా మహేష్ సౌతిండియా సూపర్ స్టారే సుమా. ఈ ఫాలోయింగ్ నే క్రెడిటేరియాగా తీసుకుంటే ఇప్పట్లో మహేష్ సరిసాటి ఎవరూ ఉండకపోవచ్చు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: