బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ఆ షోని ఫాలో అయ్యే వారందరికి తెలుసు. ముందు కంటెస్టంట్స్ లో జస్ట్ మాములుగా కనిపించినా తర్వాత తర్వాత ఆటని సీరియస్ గా తీసుకుని ఫైనల్ గా విన్నర్ అయ్యాడు. నాగ్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ ఆట అదిరిపోయిందని చెప్పాలి. అయితే హౌజ్ లో రాహుల్ కు పునర్నవితో ఫ్రెండ్ షిప్ హాట్ న్యూస్ గా మారింది. హౌజ్ లో వీళ్ల హంగామా చూసి అంతా వీరిద్దరు లవ్ లో పడ్డారని అనుకున్నారు. వాళ్లు కూడా అదే అనే బ్రమలో పడ్డారు.

 

ఫైనల్ గా బయటకు వచ్చాక కాని తెలుస్తుంది. వాళ్లు వాళ్ల గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని. అందుకే ప్రేమా దోమా అనేవి పెట్టుకోకుండా జస్ట్ స్నేహితులుగా ఉండాలని అనుకున్నారు. పునర్నవి మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పడంతో రాహుల్ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇదిలాఉంటే పునర్నవిని వదిలిపెట్టి హౌజ్ లో మరో కంటెస్టంట్ అయిన అషు రెడ్డితో రాహుల్ క్లోజ్ గా ఉంటున్నాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అందరు అందరిని కలుస్తున్నారు.

 

పార్టీలని.. మీటింగులని చేసుకున్నారు.. అయితే రాహుల్ పునర్నవిని వదిలిపెట్టి కొత్తగా అషు రెడ్డితో కనిపిస్తున్నడు. అయితే వీళ్లిద్దరిని ఒకటి రెండు సార్లు జంటగా చూసిన ప్రేక్షకులు మళ్లీ రాహుల్ ను ఏంటి మ్యాటర్ మీ ఇద్దరు ఏదైనా రిలేషన్ షిప్ లో ఉన్నారా అని అడిగితే అవును.. మేము చాలా క్లోజ్ అయ్యాం.. మాది జిగిడి దోస్త్ అంటూ చెబుతున్నాడు రాహుల్. మరి పున్ను మీద ప్రేమ తగ్గి కొత్తగా అషు రెడ్డి మీద ఈ అభిమానం ఏంటో తెలియాల్సి ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: