ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 400 కోట్ల భారీ బడ్జెత్ తో తెరకెక్కిస్తున్న సినిమా 'రౌద్రం రణం రుధిరం'. ఈ సినిమా గురించి యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాం చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతా రామరాజు పాత్రను టీజర్ తో రివీల్ చేసినప్పటి నుంచి ఇంకా సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి. ఇక తారక్ పాత్రకి సంబంధించిన టీజర్ కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో డా.కే.ఎల్.నారాయణ ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి దాదాపు మూడేళ్ళ క్రితమే కమిటయ్యారని తెలిసిందే. ఈ సినిమాని మహేష్ బాబు కెరీర్ లో 25 వ సినిమాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని అనుకున్నారు. కాని అది సాధ్యం కాలేదు.  

 

ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళిసినిమా తర్వాత మహేష్ బాబుతో చేయబోతున్నట్టు రీసెంట్ గా స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఆర్.ఆర్.ఆర్ కంప్లీటవలేదు. అయ్యోసరికి ఖచ్చితంగా 2021 ఫస్టాఫ్ అయిపోతుంది. అంటే ఈ కాంబినేషన్ లో సినిమా 2022 అని ఫిక్సవచ్చు. అలాగే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ నిర్మించే 50 వ సినిమా కూడా మొదలయ్యోసరికి 2022 అవుతుందని అంటున్నారు.

 

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధాకృష్ణ సినిమా రిలీజ్ అయ్యోసరికి 2021 ఫస్టాఫ్ వచ్చేస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించబోయోవి. మిగతా సినిమాలన్ని కూడా మినిమం బడ్జెట్ సినిమాలే.

మరింత సమాచారం తెలుసుకోండి: