టాలీవుడ్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, ముందుగా ప్రాణంఖరీదు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన చిరంజీవి, ఆపై తనదైన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అనంతరం ఆయన హీరోగా కోదండరామిరెడ్డి తీసిన ఖైదీ సినిమా, చిరంజీవి కెరీర్ కి పెద్ద బ్రేక్ ని ఇచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా హీరోగా అవకాశాలు చేజిక్కించుకుని వాటిని విజయాలుగా మలుచుకుని ముందుకు సాగిన చిరంజీవి గొప్ప పేరు, క్రేజ్ గడించారు. ఇక చిరంజీవి పేరు చెపితే అందరికీ ముందుకుగా గుర్తుకువచ్చేది ఆయన చేసే అద్భుతమైన డ్యాన్స్ లు. 

IHG

అంతకముందు ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి వారు తమదైన శైలిలో సినిమాల్లో డ్యాన్స్ లు చేసినప్పటికీ, చిరంజీవి మాత్రం అప్పటి యువత భావాలకు తగ్గట్లుగా ట్రెండ్ ప్రకారం ఎప్పటికప్పుడు లేటెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్ తో మంచి పేరు దక్కించుకున్నారు. ఆపై తన ప్రతి సినిమాలో కూడా అదరగొట్టే డ్యాన్స్ లు చేస్తూ ముందుకు సాగిన చిరంజీవి, 2007లో సినిమాలకు కొంత విరామం పలికి రాజకీయాల్లో చేరారు. ఇక ఇటీవల పదేళ్ల విరామం తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమా విజయంతో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరొక్కసారి నిరూపించుకున్నారు. కాగా ఆ సినిమాలోని సాంగ్స్ కూడా ఆడియన్స్ నుండి మంచి స్పందనను రాబట్టాయి. 

 

ముఖ్యంగా ఆ సినిమాలో చిరు వేసిన స్టెప్స్ కి థియేటర్స్ లో ఆడియన్స్ తెగ చిందులేశారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, తనయుడు రామ్ చరణ్ తో కలిసి అమ్మడు కుమ్ముడు సాంగ్ లో మెగాస్టార్ కొన్ని క్షణాలు వేసిన స్టెప్స్ కు థియేటర్స్ లో మెగా ఫ్యాన్స్ ఈలలు, గోలలతో హోరెత్తించారు. వయసు పెరిగినప్పటికీ చరణ్ తో కలిసి మెగాస్టార్ వేసిన స్టెప్స్ ని చూసిన ప్రతి వారు కూడా ఎంతైనా మెగాస్టార్, మెగాస్టారే అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించసాగారు. ఆ విధంగా అమ్మడు కుమ్ముడు సాంగ్, మెగాస్టార్ మూవీ కెరీర్ లో మంచి డ్యాన్స్ మూమెంట్స్ తో సాగె సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పవచ్చు.....!!  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: